»   » ఆ స్టార్ హీరో ప్రక్కన బుక్కయిన శృతి హాసన్

ఆ స్టార్ హీరో ప్రక్కన బుక్కయిన శృతి హాసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ మొదటి చిత్రం 'లక్" బ్యాడ్ లక్ అనిపించినా తర్వాత మాత్రం పెద్ద హీరోల ప్రక్కన వరసగా బుక్కవుతోంది. ప్రస్తుతం రాఘవేంద్రరావు తనయుడు సూర్య ప్రకాశ్ దర్శకత్వంలో సిద్దార్ధ ప్రక్కన చేస్తున్న ఈ ముద్దు గుమ్మ త్వరలో మరో స్టార్ హీరో ప్రక్కన చేయనుంది. అతను మరెవరో కాదు. 'గజిని" సినిమాతో తమిళ, తెలుగు భాషలలో చెలరేగిపోయిన సూర్య ప్రక్కన చేయటానికి సైన్ చేసింది. ఇక చిత్రం డైరక్టర్ కూడా మరెవరో కాదు మురుగదాస్. అమీర్ ఖాన్ తో గజనీ చిత్రం రీమేక్ చేసి హిట్టు కొట్టిన ఆయన బాలీవుడ్ లో షారూఖ్, అక్షయ్ వంటి హీరోల కోసం ట్రై చేసి తిరిగి తమిళంకు వచ్చి సూర్యతో చేస్తున్నారు. ఆ ప్రతిష్టాత్మకమైన సినిమాలో శృతిహాసన్ ని తీసుకోవటంతో ఆమె దశ తిరిగనట్లే అంటున్నారు. ఇక ఈ చిత్రానికి హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. కె.రవిచంద్రన్ కెమెరా చేస్తూంటే కరుణానిధి మనవడు ఉదయగిరి స్టాలిన్ నిర్మిస్తున్నారు. మరో ప్రక్క శృతి లేటెస్ట్ గా ఎర్ర గులాబీలు రీమేక్ లో చేస్తోంది. భారతీరాజా తనయుడు మనోజ్ డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో శృతి...శ్రీదేవి అప్పట్లో చేసిన పాత్రను చేస్తోంది. మొత్తానికి శృతి కి దశ తిరిగినట్లే ఉంది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu