»   » సిద్దార్దతో రిలేషన్ గురించి నోరు విప్పిన శృతి హాసన్

సిద్దార్దతో రిలేషన్ గురించి నోరు విప్పిన శృతి హాసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేను, సిద్ధార్థ్‌ కలిసి ఆర్కా వారి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాను మంచి వ్యక్తి. చాలా సరదాగా ఉంటాడు. కలిసిపోయే వ్యక్తిత్వం సిద్ధార్థ్‌ది. అందుకే అతనితో స్నేహం కుదిరింది. కానీ అదేదో పెద్ద నేరం అయినట్టుగా మీడియాలో చిలువలు పలువలుగా గాలివార్తలు రాస్తున్నారు. వాటిని చూసి నవ్వుకోవటం తప్ప చేయగలిగింది ఏముంది. ఇక నాన్నకు నాపై ఎంతో నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఆయన నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఆ నమ్మకాన్ని పోగొట్టుకునే విధంగా ప్రవర్తించను' అంటూ తనపై వస్తున్న రూమర్స్ గురించి చెప్పుకొచ్చారు శ్రుతి. ఇక ప్రస్తుతం శృతి హాసన్ తెలుగులో చేస్తున్న చిత్రానికి రాఘవేంద్రరావు కుమారుడు కె. సూర్యప్రకాష్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తమిళంలో ఆమె సూర్య సరసన మురగదాస్ దర్శకత్వంలో చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu