»   » పైకెక్కి సవారీ చేస్తేనే మజా..శృతి హాసన్

పైకెక్కి సవారీ చేస్తేనే మజా..శృతి హాసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమల్ కూతురు శృతిహాసన్ మాటలు బాగానే నేర్చింది. ప్రతీ చిన్న విషయాన్నీ అతిశయోక్తి జోడించి చెపుతూ అందరినీ ఆకట్టుకుని ఆఫర్స్ పట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం మురగదాస్ దర్సకత్వంలో చేస్తున్న ఆమె ఆ షూటింగ్ అనుభవాలను వివరిస్తూ కొంచెం ఎక్కువ బిల్డప్పే ఇస్తోంది. ఆమె మాటల్లోనే...సూర్య..నేను ఏనుగు పై ఎక్కి సవారీ చేస్తున్నట్లుగా సన్నివేశం చిత్రీకరించాలని దర్శకుడు మురగదాస్ చెప్పారు. దర్శకుడు ఈ సీన్‌ గురించి చెప్పగానే నాకు గుండె ఆగినంత పనయ్యింది.

ఏనుగు ఎంత ఎత్తు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంత ఎత్తు ఎక్కడం అంటే నా దృష్టిలో సాహసం చేసినట్లే. మురుగదాస్‌గారు సీన్‌ వివరించగానే కాసేపు మౌనం పాటించి ధైర్యం కూడదీసుకుని సీన్‌లో యాక్ట్‌ చేశాను. భయాన్ని జయించాను కాబట్టి ఏదో సాధించిన ఫీలింగ్‌ కలుగుతోంది. ఏనుగు సవారీ చేస్తున్నప్పుడు భలే మజా అనిపించింది అంటోంది శృతిహాసన్. ఇక శృతిహాసన్ తెలుగులో ప్రస్తుతం సిద్దార్ధ సరసన కె.సూర్య ప్రకాష్ దర్శకత్వంలో రూపొందుతున్నఓ ఫాంటసీ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu