»   » కమల్ 'ఎర్రగులాబీలు' రీమేక్‌లో శ్రీదేవి పాత్రకు...

కమల్ 'ఎర్రగులాబీలు' రీమేక్‌లో శ్రీదేవి పాత్రకు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమల్ హాసన్ 'ఎర్రగులాబీలు' చిత్రంలో శ్రీదేవి పాత్రకు ఉన్న ప్రాముఖ్యత తెలిసిందే. తాజాగా రీమేక్ అవుతున్న ఈ చిత్రంలో ఆ పాత్రను కమల్ కూతురు శృతిహాసన్ పోషించబోతోంది. భారతీరాజా దాదాపు 32 సంవత్సరాల క్రితం రూపొందించిన ఈ చిత్రాన్ని ఆయన కుమారుడు మనోజ్ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు. ఇక హీరోగా కమల్ హాసన్ పాత్రలో చంద్రముఖి దర్శకుడు పి వాసు కుమారుడు శక్తి చేస్తున్నాడు. అలాగే ఈ చిత్రం మాటలు పరుత్తి వీరన్ వంటి సూపర్ హిట్ చిత్రం రూపొందించిన అమీర్ అందించనున్నారు. అలాగే మరో ప్రముఖ దర్శకుడు చేరన్ (నా ఆటోగ్రాఫ్ తమిళ వెర్షన్) చిత్రానికి ఈ రోజులకు తగినట్లుగా స్క్రీన్ ప్లే తయారుచేస్తున్నారని తెలుస్తోంది. వీటికి తోడు కమల్ కూతురు కూడా తోడవటంతో సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu