»   » ట్విట్టర్‌లో శృతి హాసన్ కి అసభ్యకరమైన రాతలు

ట్విట్టర్‌లో శృతి హాసన్ కి అసభ్యకరమైన రాతలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సంక్రాంతికి విడుదలైన అనగనగా ఓ ధీరుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పరిచయమైన అందం శృతి హాసన్. కమల్ హాసన్ కూతురైన ఆమె గత కొంత కాలంగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్ అయిన ట్విట్టర్ తో సమస్యలు ఎదుర్కోంటోంది. ఎవరో ఓ వ్యక్తి తన కిష్టం వచ్చినట్టు ఆమెను అసభ్యకరమైన, విచిత్రమైన ప్రశ్నలతో వేధిస్తున్నాడట. దాంతో ఏం చేయాలో పాలుపోని శృతి ట్విట్టర్‌లో పోస్టులు రాయటం తగ్గించిందిట. అయితే ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నవారు కాస్త మనస్సు పెట్టి ఆలోచించాలని, ఇలాంటి పనులు తగదని, ఇంకా ఎక్కువ చేస్తే ఎంక్వైరీ చేసి మరీ మూయించగలనంటూ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం శృతి సూర్య సరసన ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో '7మ్ అరివు" చిత్రంలో నటిస్తోంది.

ఇక ఈ చిత్రంలో సూర్య సర్కస్‌ కళాకారుడిగా నటిస్తున్నారు. సూర్య పాత్ర చుట్టూనే కథ నడుస్తుంది. యానిమల్ ట్రైనర్ గా ఓ విభిన్నమైన పాత్ర ఇది అని చెప్తున్నారు. ఈ పాత్ర కోసం సూర్య కొందరు సర్కస్‌ కళాకారులతో మాట్లాడినట్లు తెలిసింది. కోయంబత్తూర్ లోని గ్రేట్ ముంబై సర్కస్ లో ఈ చిత్రం షూటింగ్ కొంతకాలం జరిగింది. అలాగే మరి కొన్ని సాహసోపేతమైన సన్నివేశాల కోసం విదేశాలు వెళ్ళనున్నారని తెలుస్తోంది. రెడ్‌ జెయింట్‌ పతాకంపై నిర్మాత ఉదయనిధి స్టాలిన్‌ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. కె.రవిచంద్రన్ కెమెరా అందిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu