»   » లాయిర్ గా కనిపించనున్న శ్రుతిహాసన్

లాయిర్ గా కనిపించనున్న శ్రుతిహాసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : శ్రుతిహాసన్ త్వరలో లాయిర్ గా కనిపించి అలరించనుంది. ఆ పాత్ర ఆమెకు కొత్త అని మురిసిపోతోంది. 'వీరం' తర్వాత అజిత్‌, దర్శకుడు శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రెండో చిత్రంలో శ్రుతిహాసన్‌ హీరోయిన్. తొలిసారిగా శ్రుతిహాసన్...అజిత్ సరసన చేస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇంకా పేరుపెట్టని ఈ సినిమాలో లక్ష్మీమేనన్‌, అజిత్‌కు చెల్లెలుగా నటిస్తోంది. ఇందులో శ్రుతిహాసన్‌ లాయిర్ పాత్ర పోషిస్తున్నట్లు కోలీవుడ్‌ సమాచారం. కోల్‌కత నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మూడో షెడ్యూల్‌ చిత్రీకరణ ఇటలీలో జరుగుతోంది.

అజిత్‌, శ్రుతిహాసన్‌, లక్ష్మీమేనన్‌కు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అజిత్‌ టాక్సీ డ్రైవరుగా నటిస్తున్నారు. ఇక శ్రుతిహాసన్‌ న్యాయవాది పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన సన్నివేశాలను కోల్‌కతలో చిత్రీకరిస్తున్నారు.

Shruti Hassan Lawyer In Thala 56 Movie Pairing With Ajith

శృతి హాసన్ న్యాయవాదిగా నటిస్తున్న సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. దీంతో ఆమె న్యాయవాదిగా నటిస్తున్నట్లు దాదాపుగా ఖరారైనట్లేనని అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు.

శృతిహాసన్... కెరీర్ విషయానికి వస్తే...

ప్రస్తుతం శృతి హాసన్... మహేష్ బాబు తాజా చిత్రం శ్రీమంతుడులో చేస్తోంది. అలాగే విజయ్ సరసన ఆమె పులి చిత్రం చేస్తోంది.

శృతి హాసన్ మాట్లాడుతూ...''ఎవరు ఎన్ననుకొన్నా, ఏం చేసినా విజయం కోసమే. విజయానికి మించిన కిక్‌ ఏదీ ఇవ్వదు. హిట్‌ అనే పదం ఎందరి తలరాతలో మార్చేస్తుంది. అలాంటి విజయం ఎప్పుడు దొరికినా అపురూపమే..'' అంటోంది శ్రుతి హాసన్‌. 'గబ్బర్‌సింగ్‌' తరవాత శ్రుతి కెరీర్‌ పూర్తిగా మారిపోయింది. వరుస విజయాలతో టాప్‌గేర్‌లోకి వచ్చేసింది.

Shruti Hassan Lawyer In Thala 56 Movie Pairing With Ajith

''హిట్‌ అనేది జాతకాల్ని పూర్తిగా మార్చేస్తుంది. స్టార్లు పుట్టుకొచ్చేస్తారు. ప్రతిభకు విజయం తోడైతే ఇక చెప్పనవసరం లేదు. అలాగని విజయం సాధించిన వాళ్లంతా ప్రతిభావంతులు కాకపోవచ్చు. వాళ్లను విజయలక్ష్మి ఎంత కాలం అంటిపెట్టుకొని ఉంటుందో చెప్పలేం.

కానీ ప్రతిభ ఉంటే.. ఎప్పటికైనా విజయం సాధించొచ్చు. కాస్త ఆలస్యమైనా.. ఆ విజయం శాశ్వతం. నా కెరీర్‌లో విజయాలు లేవని ఎప్పుడూ బాధపడలేదు. నేను నమ్ముకొంది ప్రతిభనే. అదే విజయానికి దారి చూపిస్తుందన్న నమ్మకం నాకెప్పుడూ ఉంటుంది'' అంది.

English summary
Actor Ajith Kumar’s upcoming movie Thala 56 will have Shruti Hassan in female lead role. Shruti Hassan plays the role of Lawyer in ‘Thala 56′. Thala 56 is the first movie in which Ajith and Shruti Hassan pairs for the first time.
Please Wait while comments are loading...