»   » శృతి హాసన్...హాలీవుడ్ చిత్రం డిటేల్స్

శృతి హాసన్...హాలీవుడ్ చిత్రం డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ కి ఇంటర్నేషనల్ స్ధాయి ఆఫర్స్ వస్తున్నాయి. ఫిరోజ్ నడియవాల నిర్మించనున్న భారీ ప్రాజెక్టు జ్యూయిల్ ఆఫ్ ఇండియాలో ఓ కీలకమైన పాత్రకు ఆమెను ఎంపికచేసారు. ఈ చిత్రాన్ని హాలీవుడ్ దర్శకుడు రోబ్ చోహెన్ (ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫేమ్) డైరక్ట్ చేయనున్నారు. ఇక హాలీవుడ్ నటులు ఆల్ పచినో, రాబర్ట్ డి నీరో లను ఈ ప్రాజెక్టుకోసం అడుగుతున్నారు. అలాగే హిందీ నుంచి అమితాబ్, ఆయన కుమారుడు అబిషేక్ ను కూడా తీసుకునే అవకాశం ఉంది. కాస్టింగ్ ఇంకా ఫైనల్ కాలేదు.

దాదాపు మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందనున్నదని సమాచారం. 'కోహినూర్‌' వజ్రాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించనున్నారట. కథ ప్రకారం ఓ కుర్రాడు లండన్‌లోని టవర్‌లో ఉన్న కోహినూర్‌ వజ్రం నిజమైనది కాదని భావిస్తాడు. ఆ వజ్రం ఇండియాలోనే ఎక్కడో ఉందనుకుని, దానికోసం అన్వేషణ సాగిస్తాడు. ఈ నేపద్యంలో ఎదురయ్యే సవాళ్ళు, సాహసాలు ఈ చిత్ర కథ ప్రధానాంశాలు. ఇక శృతి హాసన్...సిద్దార్ధ సరసన కోవలమూడి సూర్య ప్రకాశరావు రూపొందించే సోషియో పాంఠసీలో నటిస్తోంది. అలాగే తమిళంలో సూర్య సరనస మురగదాస్ దర్శకత్వంలోనూ చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu