»   » వారసత్వం అని పనిగట్టుకొని అవకాశాలూ ఇచ్చేయలేదు

వారసత్వం అని పనిగట్టుకొని అవకాశాలూ ఇచ్చేయలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

'డాడీ పేరు సినిమా రంగంలో ఎప్పుడూ వాడుకోలేదు. కమల్‌ కూతురు అని ఎవరూ నాకు పనిగట్టుకొని అవకాశాలూ ఇచ్చేయలేదు. కానీ నాలో నటనకు, సంగీతానికి... సినిమా అంటే ప్రేమ పెరగడానికి బీజం వేసింది మాత్రం డాడీనే. సినిమా అంటే వ్యామోహం ఆయన వల్లే కలిగింది' అంటోంది శృతిహాసన్. రీసెంట్ గా ఆమె నటన,వారసత్వం అనే విషయం మీద ఇలా స్పందించింది. ఇక ఆమె తెలుగులో ఎంట్రీ ఇస్తూ చేసిన అనగనగా ఒక ధీరుడు చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు.

అయితే ఆమెకు స్టార్ హీరోల చిత్రాల్లో ఆఫర్స్ మాత్రం వస్తున్నాయి. ఆచితూచి పాత్రలను ఎంపిక చేసుకుంటున్నాననే ఆమె తమిళంలో సూర్య సరసన 'ఎంజుమ్ అరివు' అనే చిత్రంలో మురగుదాస్ దర్శకత్వంలో చేస్తోంది. సర్కస్ నేపధ్యంలో కథ జరగనుంది.. రెడ్‌ జెయింట్‌ పతాకంపై నిర్మాత ఉదయనిధి స్టాలిన్‌ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. కె.రవిచంద్రన్ కెమెరా అందిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu