»   » 'త్రి ఇడియట్స్' రీమేక్ లో శ్రుతి హాసన్?

'త్రి ఇడియట్స్' రీమేక్ లో శ్రుతి హాసన్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అమీర్ ఖాన్ సూపర్ హిట్ 'త్రి ఇడియట్స్' ని తమిళంలో విజయ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. జెమినీ ఫిల్మ్ సర్క్యూట్స్ వారు నిర్మించే ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రుతిహాసన్ ని సంప్రదించినట్లు సమాచారం. అలాగే శ్రుతి కూడా ఆసక్తి చూపుతోందని ఈ మేరకు అగ్రెమెంట్ కుదుర్చుకున్నట్లు చెప్తున్నారు. మొదట ఈ పాత్రకు కత్రినాకైఫ్ ని సంప్రదించారు. ఆమె డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేనని చేతులు ఎత్తేయటంతో ఆ ఆఫర్ శృతిని వరించింది. అలాగే విజయ్ కాకుండా మిగతా ఇద్దరు ఇడియట్స్ గా ఏ హీరోలుని తీసుకోవాలనేదానికి సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రానికి దర్శకుడుగా ప్రభుదేవాని ఎంపికచేసే అవకాశాలు ఉన్నాయి. ఇక శ్రుతి ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో తమిళ హీరో సూర్య కాంబినేషన్లో ఓ చిత్రం చేస్తోంది. అలాగే రాఘవేంద్రరావు తనయుడు సూర్య ప్రకాష్ దర్శకత్వంలో సిద్దార్ద సరసన కూడా శృతి చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu