»   »  'షటప్ యువర్ మౌత్' అంటూ శ్రుతిహాసన్ ...

'షటప్ యువర్ మౌత్' అంటూ శ్రుతిహాసన్ ...

Posted By:
Subscribe to Filmibeat Telugu
చెన్నై : 'షటప్ యువర్ మౌత్' అంటూ సీరియస్ గా చెప్తోంది శ్రుతి హాసన్. గబ్బర్ సింగ్, బలుపు చిత్రాలతో ఫామ్ లోకి వచ్చిన శ్రుతి ..అటు హీరోయిన్ గా...అదరకొడుతూనే మరో ప్రక్క పాటలు పాడే కార్యక్రమం కూడా పెట్టుకుంది. తాజాగా ఆమె తమిళంలో ఓ పాట పాడింది. తెలుగులో హిట్టైన అలా మొదలైంది చిత్రం రీమేక్ గా రూపొందుతున్న చిత్రంలో ఆమె చేత ఓ పాటను పాడించారు. షటప్ యువర్ మౌత్ అంటూ సాగే ఈ పాట బాగా వచ్చిందని, అది హిట్టై ఆమెను అందరూ తమి సినిమాల్లో ఒక పాటపాడమని అడుగుతారని దర్శకుడు చెప్తున్నారు.

నాని, నిత్యా మీనన్ కాంబినేషన్ లో దర్శకురాలు బి.వి. నందినిరెడ్డి రూపొందించిన అలా మొదలైంది చిత్రం విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం రీమేక్ రైట్స్ అరకోటికి పైగా అమ్ముడైనట్లు సమాచారం. తమిళంలో రెగ్యులర్ సినిమాలు తీస్తున్న ఓ లీడింగ్ ప్రొడ్యూసర్ ఈ రైట్స్ ని తీసుకున్నట్ల చెప్తున్నారు. అలాగే మళయాళ పరిశ్రమనుంచి కూడా రీమేక్ రైట్స్ కు ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం హిట్ కు నిర్మాత కె.ఎల్. దామోదర్‌ప్రసాద్ కారణం చెప్తూ..ఇది సింపుల్ పాయింట్ మీద తీసిన సినిమా. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్రీన్‌ప్లే. స్వచ్ఛమైన వినోదాత్మక చిత్రం అందుకే వర్కవుట్ అయింది అన్నారు.

చిత్ర కథ ప్రకారం...గౌతమ్(నాని) ఇష్టపడ్డ అమ్మాయి సిమ్రాన్(కీర్తి కర్బంధ) అతనికి హ్యాండిచ్చి ఓ డాక్టర్ ని పెళ్ళి చేసుకుంటుంది. ఆ పెళ్ళికి ప్రెండ్స్ బలవంతం మీద వెళ్ళిన గౌతమ్ కి అక్కడ నిత్య(నిత్య మీనన్) పరిచయం అవుతుంది. నిత్య ది కూడా సేమ్ సమస్యే. ఆ పెళ్ళికొడుకు(డాక్టరు) ఆమెకు హ్యాండిచ్చి సిమ్రాన్ ని పెళ్ళి చేసుకుంటూంటాడు. దాంతో ఒకే సిట్యువేషన్ లో ఇరుక్కున్న ఇద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుని ప్రెండ్స్ అవుతారు. అక్కడనుంచి రకరకాల సంఘటనలతో వీరిద్దరి మధ్యా ప్రేమ మొలకెత్తుతుంది. అయితే వీళ్ళు ఒకరికి ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకునేలోగా వీరికి రకరకాల మలుపులు,మనుష్యులు అడ్డంగా నిలుస్తారు. ఈ క్రమంలో వీటిన్నటినీ అధిగమించి వీరిద్దరూ ఎలా కలుస్తారనేది సరదాగా రూపొందించిన కథనం.

శ్రుతి హాసన్ మాట్లాడుతూ.... ' అదో ఫన్ సాంగ్ ...నేను చాలా ఇష్టపడి పాడాను... ఇక విజయం సాధిస్తే విర్రవీగడం, పరాజయం ఎదురైతే పారిపోవడం ఇలా ఉండటం నాకు ఇష్టం ఉండదు' అంటోంది శ్రుతి హాసన్‌. తన దృష్టిలో రెండూ సమానమేనట. 'విజయాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు! కష్టపడినదానికి ఫలితం వచ్చింది అనుకుంటారు. కరక్టే, కానీ ఆ విజయం తరువాత మరింత కష్టపడాల్సిన బాధ్యత ఉంటుందని గ్రహించరు. ఈ విషయంలో నాకు అమితాబ్‌ బచ్చన్‌ ఆదర్శం. సక్సెస్‌ వచ్చినా ఫెయిల్యూర్‌ వచ్చినా ఆయన స్పందించే తీరు ఒకేలా ఉంటుంది. ఇప్పుడిప్పుడే నాకూ ఆ తీరు అలవాటు అవుతోంది' అని చెబుతోంది శ్రుతి.

English summary
D Imman is taking extra care to make the music of the Tamil remake of the Telugu film Ala Modalaindi a success. After getting Anirudh to sing for a song in the Gautham Karthik-Rakul Preet Singh starrer, Imman has now got Shruti Haasan to croon for another number in the film.
 “Shruti has sung for the track Shut Up Your Mouth, which has been written by Madhan Karky. The tune has Middle Eastern influences, which is new to both of us,” says the composer, adding, “Though it’s a duet song (the male portions have been sung by Deepan, a Super Singer contestant), the female vocals will be predominant in a 70-30 ratio.” Shruti too says, “I sang for Imman a couple of days ago and it’s a fun song.” Imman informs that the song will be “like an item number” and will be picturized on Gautham Karthik and the film’s second female lead Nikesha Patel.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu