»   » రీమేక్ వివాదం: దర్శకుడుకి,నిర్మాతకు మధ్య చిచ్చు

రీమేక్ వివాదం: దర్శకుడుకి,నిర్మాతకు మధ్య చిచ్చు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ఓ చిత్రం ఓ భాష నుంచి మరో భాషలోకి రీమేక్ అవుతోందంటే దర్శక,నిర్మాతలకు ఫుల్ హ్యాపి. ముఖ్యంగా నిర్మాత అది ఎగస్ట్రా మనీ క్రిందే లెక్క. అయితే దర్శకుడుకు మొదటే ఎగ్రిమెంట్ లో రీమేక్ రైట్స్ గురించి రాసుకుంటే...రైట్స్ నిమిత్తం వచ్చిన డబ్బు ఇవ్వాలి. అలాగే రీమేక్ రైట్స్ అమ్మేటప్పుడు రైటర్ కు హక్కు ఉంటుంది. అతనికి డబ్బు వెళ్తుంది. ఒక్కోసారి అవే...అప్పటివరకూ మంచి మిత్రులుగా ఉన్నవారి మధ్య గొడవలు పెడతాయి. అలాంటి సంఘటనే రీసెంట్ గా..సిద్దార్ద చిత్రం తమిళ చిత్రం జిగర్తాండ విషయంలో చోటు చేసుకుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సూపర్ హిట్ చిత్రం పిజ్జా ఫేం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన సినిమా.. తమిళనాట విజయం సాధించడంతో పాటు ఇటీవల ఈ సినిమాలో విలన్ గా నటించిన బాబీ సింహాకు నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. ఇప్పుడీ సినిమా బాలీవుడ్ లో రీమేక్ కాబోతోంది. దక్షిణాది సినిమాలతో బాలీవుడ్ లో కిక్, హౌస్ ఫుల్ వంటి విజయాలు అందుకున్న సాజిద్ నడియడ్ వాలా.. జిగర్తాండ సినిమా హిందీ రీమేక్ హక్కులు అందుకున్నాడు.

దీంతో.. ఓ ప్రముఖ బాలీవుడ్ హీరో ఈ సినిమాలో నటించే అవకాశాలు కన్పిస్తున్నాయి. మరి.. తమిళంలో విజయంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ మూవీ.. బాలీవుడ్ లో ఏస్థాయి విజయం సాధించనుందో కానీ ఈ లోగా దర్శక,నిర్మాతలు మధ్య గొడవలు మొదలైనట్లు చెన్నై వర్గాల సమాచారం.

దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుకు ..ఈ చిత్రం రైట్స్ లో నలబై పర్శంట్ షేర్ ఉంది. అయితే గప్ చుప్ గా...నిర్మాత రైట్స్ అమ్మేసాడు. విషయం తెలుసుకున్న సుబ్బరాజు మండిపడుతున్నాడు. ఈ విషయాన్ని ఆయన డైరక్టర్స్ అశోశియేషన్ కు తీసుకు వెళ్లి అక్కడ కంప్లైంట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Siddardha's Jigarthanda producer,director clash

మరో ప్రక్క సిద్ధార్థ్ కు తెలుగులోనూ ఉన్న మార్కెట్ దృష్ట్యా.. జిగర్తాండ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేసే యోచనలో ఉన్నారు. చిక్కడు దొరకడు పేరుతో ఈ సినిమా తెలుగులో అనువాదమవుతోంది. అయితే.. తెలుగులోకి రాకముందే ఈ సినిమా బాలీవుడ్ కు వెళ్తోంది.

ఇదిలా ఉంటే...

తెలుగు వెర్షన్ ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే అనూహ్యంగా విడుదల వాయిదా వేశారు. ఇతర నిర్మాతలకు, పంపిణిదారులకు సినిమా విడుదల చేయడం లేదనే వార్తను స్వయంగా తెలిపిన నిర్మాత కదిరేశన్.. తనకు చెప్పకపోవడంపై హీరో సిద్దార్ధ్ ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కు కూడా తెలుపలేదట. తెలుగులో ఈ సినిమాను పంపిణి చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. అందుకే విడుదల వాయిదా వేశారని సమాచారం.

దర్శకుడు కార్తీక్, నేను. సినిమా టెక్నిషియన్స్ అందరూ ‘జిగర్తాండ' చిత్రం కోసం చాలా కష్టపడ్డాం. కనీసం మాతో మాట మాత్రమైనా చెప్పకుండా విడుదల వాయిదా వేశారు. దీనికి కారణం కొందరు వ్యక్తులు, వారి నీచ రాజకీయాలు. వారు సినిమా విడుదలను మాత్రమే అడ్డుకోగలరు, సినిమా విజయాన్ని కాదు. మంచి సినిమా ఎప్పుడు విడుదల అయినా ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. ప్లీజ్ సపోర్ట్ కార్తీక్ & ‘జిగర్తాండ' టీం. త్వరలో కొత్త విడుదల తేదిని తెలుస్తుంది. ‘ అంటూ సిద్దార్ధ్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.

English summary
Director Karthik Subbaraj is unhappy with producer Kathiresan who sold the Siddharth, Lakshmi Menon's ‘Jigarthanda’'s Hindi re-make rights to Bollywood producer Sajid Nadiadwala.
Please Wait while comments are loading...