»   » '180' కీ రొమాంటిక్ హీరో సిద్ధార్థకీ సంభందం ఏమిటీ?

'180' కీ రొమాంటిక్ హీరో సిద్ధార్థకీ సంభందం ఏమిటీ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సిద్ధార్థ హీరోగా జయేంద్ర దర్శకత్వంలో రూపొందే చిత్రం టైటిల్ '180' అని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే ఈ చిత్రం దర్శకుడు గతంలో యాడ్ ఫిల్మ్ మేకర్ కావటంతో విజువల్ గా బాగా ఇంపార్టెన్స్ ఉండే అవకాశముంటుందంటున్నారు. తమిళ, తెలుగు రూపొందే ఈ చిత్రం కోసం ప్రియా ఆనంద్ హీరోయిన్, నిత్యా మీనన్ లను హీరోయిన్ లుగా తీసుకున్నారు. ఈ ప్రాజెక్టుని సత్యం సినిమాస్ కిరణ్ రెడ్డి, ఆగల్ పిల్మ్స్ సి.శ్రీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మేజర్ పార్ట్ యుఎస్ లో జరగనుంది. ఇండోర్ షూటింగ్ మలేషియాలో చేస్తారు. కెమెరా మెన్ గా కెటి బాలసుబ్రమణ్యమ్ ని ఎంపిక చేసారు. రెడ్ కెమెరా తో దీన్ని షూట్ చేస్తారు. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం సిద్ధార్థ...సూర్యప్రకాశరావు రూపొందిస్తున్న సోషియో పాంఠసీ చిత్రంలోనూ, బావ అనే చిత్రంలోనూ చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu