»   » ఒకటే ఆలోచన: సమంతే కాదు సిద్దార్ద 'నో' చెప్పాడు

ఒకటే ఆలోచన: సమంతే కాదు సిద్దార్ద 'నో' చెప్పాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : మలయాళంలో విడుదలైన 'బెంగళూర్‌ డేస్‌' చిత్రం తమిళ రీమేక్‌లో సిద్ధార్ధ్‌, సమంత నటిస్తున్నట్లు కోలీవుడ్‌, టాలీవుడ్ లో ప్రచారం జరిగింది. ఈ ఇద్దరి స్నేహం మధ్య చీలికలు ఏర్పడ్డాయని, అందువల్ల ఆ జంట ఇకపై కలిసి నటించబోదని వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ ప్రచారం జరగడంతో అది తమిళ చిత్ర పరిశ్రమలో ఆసక్తిని కలిగించింది. వారి ప్రేమ వ్యవహారం ముగిసిన తరువాత సింబు-నయనతార, సింబు-హన్సిక జంటగా నటించినట్లే సిద్ధార్థ్‌-సమంత కూడా కలిసి నటిస్తున్నారని అంతర్జాలంలో పుంఖానుపుంకాలుగా వ్యాసాలు వచ్చాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
వీటిని సిద్ధార్థ్‌, సమంత ఇద్దరూ తమ వెబ్‌సైట్లలో ఖండించారు. 'బెంగళూర్‌ డేస్‌'లో తాను నటించడం లేదని, 2015లో నటించనున్న చిత్రాల గురించి వివరాలను త్వరలో తెలియజేస్తానని, ప్రస్తుతం 'ఎనక్కుళ్‌ ఒరువన్‌' చిత్రం విడుదల కోసం వేచి చూస్తున్నానని తన సామాజిక వెబ్‌సైట్‌ పేజీలో సిద్ధార్థ్‌ తెలిపారు. అలాగే తను కూడా నటించడం లేదని సమంత తన సామాజిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

Siddharth not in Bangalore Days remake

మలయాళంలో ఘనవిజయం సాదించిన ‘బెంగళూరు డేస్' సినిమాను తెలుగు, తమిళ భాషలలో పివిపి సంస్థ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రకటించకపోయినా ఈ సినిమాలో సిద్దార్ధ్, సమంత నటిస్తారనే ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలను సిద్దార్ధ్ ఖండించారు. సోషల్ మీడియాలో ఈ విషయం వెల్లడించారు. త్వరలో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ వెల్లడిస్తానని చెప్పారు. సిద్దార్ధ్, సమంతల లవ్ ఫెయిల్యూర్ దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది.

‘బొమ్మరిల్లు' భాస్కర్ ఈ రీమేక్ దర్శకత్వ భాద్యతలు చేపట్టారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చివరి దశలో ఉన్నాయని సమాచారం. మార్చ్ 1వ తేదీ నుండి హైదరాబాద్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తమిళంలో ఆర్య, నిత్యా మీనన్, బాబీ సింహా.. తెలుగులో కమెడియన్ నుండి హీరోగా ప్రమోట్ అయిన హీరో సునీల్ కీలక పాత్రల్లో నటిస్తారని ప్రచారం జరుగుతుంది.

English summary
Actor Siddharth has made it very clear that he is not a part of the star cast of Bangalore Days remake. This Malayalam film was a mega hit and plans are afoot to remake it in Tamil and Telugu.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu