twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నీలాంటి ఇడియెట్స్ ఉండబట్టే.. సిద్ధార్థ్‌కు చుక్కలు చూపించిన నెటిజన్లు!

    |

    దక్షిణాదిలో విలక్షణ నటుడు సిద్దార్థ్ ట్వీట్లు చేసి వివాదంలో ఇరుక్కోవడం సాధారణంగా మారింది. తాజాగా నర్మదా తీరంలో ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంపై ట్వీట్లు చేసి అభాసుపాలయ్యాడు. సిద్ధార్థ్ ట్వీట్‌కు నెటిజన్లు స్పందించి.. తీవ్రమైన పదజాలంతో దుమ్ముదులిపారు. అయితే వారికి సిద్ధార్థ్ గట్టిగానే బదులిచ్చాడు. ఇంతకీ సిద్ధార్థ్ చేసిన ట్వీట్ ఏమిటంటే..

    అంతు చూస్తా.. ఎంతకైనా తెగిస్తా.. హీరో సిద్ధార్థ్‌కు డైరెక్టర్ వార్నింగ్అంతు చూస్తా.. ఎంతకైనా తెగిస్తా.. హీరో సిద్ధార్థ్‌కు డైరెక్టర్ వార్నింగ్

    నర్మదా నదీ తీరంలో

    నర్మదా నదీ తీరంలో

    నర్మదా నది తీరంలో 20 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో ప్రపంచంలోనే ఎత్తైన 182 మీటర్ల సర్దార్ పటేల్ విగ్రహ్రాన్ని ఏర్పాటు చేశారు. 12 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో కృత్రిమ సరస్సును నిర్మించి ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. బీజేపీ ప్రభుత్వం రానున్న ఎన్నికల ప్రచారం కోసం, లబ్ది పొందేందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచారు అని ప్రధాని నరేంద్రమోదీపై నిప్పులు చెరిగారు.

    సిద్ధార్థ్ ట్వీట్ చేసి..

    సిద్ధార్థ్ ట్వీట్ చేసి..

    గుజరాత్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహా ఏర్పాటుు డబ్బు, శ్రమ వృథా చేసి గొప్ప నాయకుడికి అగౌరవం తెచ్చారు. ఎన్నికల గిమ్మిక్కుగా బీజేపీ సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించింది అని సిద్దార్థ్ ట్వీట్ చేశారు. సిద్ధార్థ్ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు దారుణమైన కామెంట్లు చేశారు.

    సిద్ధార్థ్‌ను తప్పుపట్టిన నెటిజన్లు

    ప్రధాని మోదీపై విమర్శలు సంధించిన సిద్ధార్థ్‌ను పలువురు తప్పుపట్టారు. చారిత్రాత్మక విలువ తెలియకుండా మాట్లాడుతున్నారు. ఆ విగ్రహం ఏర్పాటు వల్ల ఎంత మొత్తంలో టూరిజం అభివృద్ధి అవుతుందో తెలుసా అని ప్రశ్నించారు.

    గొప్ప నాయకుడి చరిత్ర

    గొప్ప నాయకుడి చరిత్ర

    సర్దార్ పటేల్ జీవితం గురించి నీకు తెలుసా? ఆయన సేవలను చరిత్ర పుస్తకాల్లో లేకుండా చేశారు. 500కు పైగా సంస్థానాలను విలీనం చేసిన ఘనత ఆయనదే. అలాంటి వ్యక్తిపై మీరు విమర్శలు చేస్తారా? అని నెటిజన్లు ప్రశ్నించారు.

    ప్రజాధనం దుర్వినియోగం కాలేదు

    ప్రజాధనం దుర్వినియోగం కాలేదు. రైతులకు ఇవ్వొచ్చుగా అని ప్రశ్నించే వాళ్లకు ఒకే సమాధానం. రైతుల కోసం కేటాయించిన నిధులు వారికి వెళ్తున్నాయి. అవినితీ, పారదర్శక పాలనతో ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇలాంటి వాటికి అడ్డుపడకు అని మరో వ్యక్తి ట్వీట్ చేశారు.

     మీలాంటి ఇడియెట్స్ ఉంటే

    మీలాంటి ఇడియెట్స్ ఉంటే

    తరతరాలుగా తమిళనాడులో మీలాంటి ఇడియెట్స్ ఉంటూనే ఉన్నారు. మీలాంటి వాళ్లు ఉంటే తమిళనాడులో వరదరాజ పెరుమాల్; శ్రీరంగపట్నం, బృహదీశ్వర ఆలయాలు నిర్మించి ఉండేవారు కాదు అని మరో నెటిజన్ పేర్కొన్నారు.

    English summary
    Tamil actor Siddharth was trolled after he mocked Prime Minister Narendra Modi, saying that he has reduced Sardar Vallabhbhai Patel to an election gimmick with the statue of Unity. Siddharth tweeted, "Arguably the most wasteful & disrespectful way to celebrate one of India's greatest leaders will be unveiled today in #Gujarat. #SardarPatel has been reduced to an election gimmick by #BJP. #Sardar and our farmers deserve better! This is a statue of #Modi in disguise. Rs. 3000cr!"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X