For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సిద్ధార్థ్‌కు చేదు అనుభవం.. అనవసరంగా కెలుక్కున్నాడు.. దుమ్ముదులిపిన నెటిజన్లు

  By Rajababu
  |
  Siddarth Gets serious Comments From Fans

  బీజేపీ, ఆరెస్సెస్ పార్టీలపై కామెంట్లు చేసి అనవసరపు వివాదంలో తలదూర్చిన విలక్షణ నటుడు, హీరో సిద్ధార్థ్‌కు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. రాజస్థాన్‌లో ఓ వ్యక్తిపై సామూహిక దాడి చేసిన ఘటనపై స్పందిస్తూ అధికారపార్టీపై సోషల్ మీడియాలో సిద్దూ కామెంట్లు చేయడం వివాదంగా మారింది. పశువులను కబేలాకు తరలిస్తున్నారనే ఆరోపణలపై రక్బర్ ఖాన్ అనే వ్యక్తిపై అల్వార్ జిల్లాలో ఇటీవల సామూహిక దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇంతకీ సిద్దార్థ్ ఏమని ట్వీట్ చేశారంటే..

  సిద్దార్థ్ ట్వీట్ ఇదే

  ఓ మనిషిని దారుణంగా చావబాదుతారా? గోరక్షకులకు, పశువుల అంశానికి ఏమైనా సంబంధం ఉందా? హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి ముందు గోశాలకు తీసుకెళ్లారా? అవును. ఈ వ్యవహారంలో పోలీసులు దారుణంగా విఫలమయ్యారు. మిస్టర్ రాథోడ్ (కేంద్రమంత్రి రాజ్యవర్థన్ రాథోడ్) మీ తీరు బాగాలేదు. నీవో పిరికివాడివి అని సిద్ధార్థ్ ట్వీట్ చేశారు.

  రక్బర్ ఖాన్ నరికివేతపై

  రక్బర్ ఖాన్ నరికివేతపై

  గతంలో పెహ్లూఖాన్‌ను చంపిన వారికి అండగా ప్రభుత్వం నిలిచింది. అదే విధంగా రక్బర్ ఖాన్‌ను నరికివేశారు. ఇప్పడు ఆ నిందితులకు కూడా సర్కార్ మద్దతుగా నిలుస్తున్నది. ఆవులను, సంరక్షించేందుకు వెళ్లిన వారిపై రాజస్థాన్ ప్రభుత్వం ఇలా దాడులు చేయడం సబబేనా అని సిద్ధూ ప్రశ్నించారు.

  సిద్దూపై నెటిజన్ల ట్వీట్ల దాడి

  సిద్దూపై నెటిజన్ల ట్వీట్ల దాడి

  సిద్దూ చేసిన ట్వీట్లపై కొందరు నెటిజన్లు విరుచుకుపడ్డారు. అవకాశాలు సన్నగిల్లిన నటీ, నటులు ఈ మధ్య ఖాళీగా కూర్చొని తమ మొబైల్స్‌లో ఏది పడితే అది పెట్టేస్తారు. బుర్రలో ఏది తోచితే అది సోషల్ మీడియాలోకి తోసేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరిగిందనే విషయం తెలియకుండా అవాకులు చెవాకులు పేలుతున్నారు. వ్యక్తుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టకు. అది బాధ్యతారాహిత్యంగా మారుతుంది అని రాహుల్ చక్రవర్తి అనే నెటిజన్ విరుచుకుపడ్డారు.

  సిద్దార్థ నైతికతను కోల్పోయావు

  సిద్దార్థ నైతికతను కోల్పోయావు

  సిద్ధార్థ్ నీవు నీ నైతికతను కోల్పోయావు. రక్బర్ ఖాన్ దాడిపై స్పందించడానికి ముందు దేశంలో జరిగిన ప్రతీ దాడిపై స్పందిస్తే బాగుండేది. కొన్ని రాష్ట్రాలను టార్గెట్ చేసుకొని కామెంట్ చేయడం సరికాదు. ఇలాంటి ఘటనలు కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్‌లో కూడా జరిగాయని పొండే రాము ఆగ్రహం వ్యక్తం చేశారు.

  నీవు మరో ప్రకాశ్ రాజ్‌వి

  నీవు మరో ప్రకాశ్ రాజ్‌వి

  కేరళలో పూజారి ఓ మహిళను రేప్ చేశాడు. ఓ నన్‌ (క్రైస్తవ సన్యాసి)పై బిషప్ లైంగిక దాడి చేశాడు. వీరంతా జైల్లో లేరు. వారికి శిక్ష పడలేదు. కేవలం హిందువులనే తప్పుపడుతావా? ఈ విషయంలో మీది రాజకీయం కాదా? యువకులతో ముస్లిం బాబా అసహజసిద్ధంగా సెక్స్ చేస్తే మాట్లాడవా? నీవు మరో ప్రకాశ్ రాజ్‌వి అని పలువురు ట్వీట్లతో హోరెత్తించారు.

  English summary
  Siddharth trolled on lynching comment against BJP
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X