»   » 'ఏకవీర' దర్శకుడుతో సిద్ధార్ద చిత్రం ఖరారు

'ఏకవీర' దర్శకుడుతో సిద్ధార్ద చిత్రం ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: రొమాంటిక్ హీరో సిద్దార్ధ మరో చిత్రం కమిటయ్యారు. చారిత్రక చిత్రం ఏకవీర తో తెలుగువారికి సైతం పరిచయమైన ప్రముఖ తమిళ దర్శకుడు వసంత్ బాలన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రాన్ని గతంలో సిద్దార్దతో లవ్ ఫెయిల్యూర్ చిత్రం నిర్మించిన శశికాంత్ అనే ప్రొడ్యూస్ చేయనున్నాడు. ఈ విషయాన్ని శశికాంత్ సైతం కన్నర్మ్ చేసారు. ఆయన మాట్లాడుతూ..." అవును, సిద్దార్ధతో ఓ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నాం..అయితే ఇంకా ఎర్లీ స్టేజెస్ లో ఉంది. ఈ సమయంలో ఈ చిత్రం గురించి ఎక్కువ మాట్లాడలేం," అన్నారు.

సిద్దార్ద విషయానికి వస్తే.... వరస ఫ్లాపులతో దూసుకుపోతున్న సిద్దార్ధకి సినిమాలు మాత్రం 2012 లో గ్యాప్ రాకుండా విడుదల అవుతున్నాయి. ఈ సంవత్సరం సిద్దార్ద నటించిన మూడు చిత్రాలు విడుదల కానున్నాయి. మొదట దీపా మెహతా దర్శకత్వంలో రూపొందుతున్న మిడ్ నైట్ చిల్ట్రన్ చిత్రం వస్తుంది. ఇక ఈ రెండు చిత్రాల అనంతరం హిందీలో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం విడుదల అవనుంది.

ఇవన్నీ వేరే భాషల్లో రెడీ అవుతున్న చిత్రాలు. తెలుగు విషయానికి వస్తే నందీనీ రెడ్డి దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించే చిత్రాలు విడుదల అవుతాయి. ఇవన్నీ కాక మరో మూడు చిత్రాలు ఈ సంవత్సరం ప్రారంభమవుతాయని తెలుస్తోంది. ఇక సిద్దార్ద ఈ మధ్య కాలంలో బావ, 180, ఓ హ్ మై ప్రెండ్ చిత్రాలతో నిరాశపరిచాడు. అయినా అతనిపై నిర్మాత,దర్శకులుకు నమ్మకాలు మాత్రం తగ్గలేదు.

2012లో మంచి ఫలితాల్ని చవిచూస్తాననే నమ్మకం ఉంది. నాలుగైదు భాషల్లో నటిస్తున్నాను అని సిద్దార్ధ అన్నారు. ఇక ఏకవీర చిత్రం విషయానికి వస్తే 18 శతాబ్ది నాటి దక్షిణ భారత దేశాన్ని కళ్ళ ముందు ఆవిష్కరింపచేసే ప్రయత్నం చేసింది. రవిరాజా పినిశెట్టి గారి అబ్బాయి ఆది హీరోగా వచ్చిన ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఒకే రోజు విడుదలైంది. అయితే ఆ చిత్రం మార్నింగ్ షో కే ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

English summary
Vasantha Balan's Ekaveera might not have done as well as expected but the acclaimed director has begun work on his next. He has now signed up Siddharth to play the lead in his upcoming film which will be produced by S Sashikanth, who earlier produced Kadhalil Sodhappuvadhu Yeppadi with the actor.
Please Wait while comments are loading...