»   » మదురై కుర్రాడిగా సిద్ధార్థ్‌

మదురై కుర్రాడిగా సిద్ధార్థ్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu
చెన్నై : 'బాయ్స్‌' ద్వారా తెలుగు,తమిళ ప్రేక్షకులను పలకరించిన నటుడు సిద్ధార్థ్‌. ఆ తర్వాత బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నువ్వు వద్దంటానా వంటి చిత్రాలతో ... తెలుగువారికి నచ్చిన హీరోగా పేరు సొంతం చేసుకున్నాడు. కానీ కొంత కాలంగా తెలుగులో పెద్దగా ఆఫర్స లేవు. ఇప్పుడు తన దృష్టిని తమిళతెరపై పెట్టాడు. 'పిజ్జా' దర్శకుడు కార్తిక్‌ సుబ్బురాజ్‌ నిర్దేశకత్వంలో 'జిగర్‌దండా'లో నటిస్తున్నాడు.

ఇందులో దర్శకుడి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. మరి మదురై యువకుడిగా ఎలా అయ్యాడని అనుకుంటున్నారా? సినిమా దర్శకత్వం కోసం మదురై వెళ్లే సిద్ధార్థ్‌ అక్కడ కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటాడు. తన వృత్తిని పక్కనబెట్టి పక్కా మదురై యువకుడిగా మారి ఎలా పోరాడాడన్నదే కథాంశం. మాస్‌ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని యూనిట్ చెబుతోంది.

దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ మాట్లాడుతూ... ''సినిమా కథ గురించి ఇప్పుడే చెప్పలేను. కానీ యాక్షన్‌, డ్రామా సమ్మిళితంగా చిత్రం ఉంటుందని మాత్రం చెప్పగలను'' అని తెలిపారు. ఫైవ్‌ స్టార్‌ మూవీస్‌ బ్యానర్‌పై ఆ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం తన కెరీర్ లో మరో మలుపు అవుతుందని సిద్దార్ద చెప్తున్నారు. నిర్మాత కథిరేశన్‌ మాట్లాడుతూ... ''సిద్ధార్థ హీరోగా తమిళ, తెలుగుభాషల్లో ఏకకాలంలో నిర్మితమయ్యే మెగా ప్రాజెక్టుకు కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహిస్తారు. చిత్రంలో ఇతర తారాగణం ఇంకా ఖరారు కాలేదు'' అని అన్నారు.

తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో సిద్ధార్థ్‌ సరసన నాయికగా లక్ష్మీమీనన్‌ నటిస్తుంది. తమిళంలో లక్ష్మీ మీనన్ కి మంచి క్రేజ్ ఉంది. దాంతో చిత్రానికి మంచి డిమాండ్ ఏర్పడుతుందని భావిస్తున్నారు. 'కాదలిల్‌ సొదప్పువదు ఎప్పడి'తో కోలీవుడ్‌లో స్థిరపడాలని సహ నిర్మాతగానూ మారాడని కోడంబాక్కం సమాచారం. ఆ తర్వాత తమిళ నేటివిటీకి దగ్గరగా సుందర్‌.సి దర్శకత్వంలో 'తీయా వేల సెయ్యనుం కుమారు'( తెలుగులో సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ )లో నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఆ హవాను కొనసాగించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు.

English summary

 Director Karthik Subbaraj made his debut with “Pizza”, which received rave reviews from all quarters. Now the director is all set to start his next venture which will be a Tamil-Telugu bilingual. This movie is expected to be a complete comedy entertainer. It seems like Siddharth will be playing the lead role in this movie. The story is supposedly about a loser becoming a don and a real don turning a loser. Karthik Subbaraj is also planning to make the script as humorous as possible and he is also simultaneously looking for a suitable heroine for the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu