»   » ఆడియో పంక్షన్ కి కమల్‌ హాసన్ గెస్ట్

ఆడియో పంక్షన్ కి కమల్‌ హాసన్ గెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : త్వరలో కమల్ హాసన్ ఓ ఆడియో పంక్షన్ కి ఛీఫ్ గెస్ట్ గా రావటానికి అంగీకరించారు. దాంతో ఆ చిత్రం యూనిట్ ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది. ఇంతకీ ఆయన వెళ్ళబోయే... ఆడియో పంక్షన్ ఏమిటీ అంటే.... తమిళ హీరో విక్రమ్ ప్రభు నటించిన 'శిఖరం తొడు'. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆగస్టు ఏడో తేదీన చెన్నైలో నిర్వహించనున్నారు.

'కుమ్కీ', 'అరిమా నంబి' వంటి వరుస చిత్రాల్లో విజయానందుకొన్నారు విక్రం ప్రభు.. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం 'శిఖరం తొడు'. 'తూంగానగరం' ఫేం గౌరవ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విక్రం ప్రభుకు జంటగా మోనాల్‌ గజ్జర్‌, ఇమాన్‌ సంగీతం సమకూర్చారు. కమర్షియల్‌ యాక్షన్‌ చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. 'విశ్వనటుడు' కమల్‌హాసన్‌ ముఖ్య అతిథిగా హాజరై ఆడియో విడుదల చేయనున్నారు.

‘Sigaram Thodu’ audio launch will have Kamal Hassan gracing the event

నిర్మాతమ మాట్లాడుతూ... విక్రంప్రభు యాక్షన్‌ తమిళ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటోంది. యాక్షన్‌ చిత్రాలకు ఆయన పూర్తి స్థాయిలో నప్పుతారు. అలాంటి నేపథ్యంతోనే 'శిఖరం తొడు'ను తెరకెక్కించాం. ఇమాన్‌ సంగీతం మరో హైలెట్‌గా ఉంటుంది. మోనాల్‌ గజ్జర్‌ కథలో కీలకపాత్ర పోషించారు. యాక్షన్‌, కమర్షియల్‌ ప్రియులను ఈ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందని పేర్కొన్నాయి.

English summary
On cloud nine with his back to back hits, actor Vikram Prabhu has an avid view on his fourth project ‘Sigaram Thodu’. Audio launch of the movie is scheduled for August 6 and the event is said to get graced by legendary actor Kamal Hassan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu