»   » నయనతార పెళ్లి విషయమై శింబు సంచలన వ్యాఖ్య

నయనతార పెళ్లి విషయమై శింబు సంచలన వ్యాఖ్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : పరిస్థితులన్నీ అనుకూలిస్తే తన మాజీ లవర్ నయనతారకు, విఘ్నేష్‌ శివన్‌కు తానే పెళ్లి చేయిస్తానని నటుడు శింబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ''విఘ్నేష్‌ శివన్‌ నా స్నేహితుడే. గతంలో కూడా నయనతార, ప్రభుదేవా ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు విఘ్నేష్‌ గురించి వస్తున్నాయి. ఒకవేళ అదే నిజమై పరిస్థితులు అనుకూలిస్తే వారి పెళ్లి నేను జరిపిస్తాను''అని చెప్పాడు శింబు. ప్రస్తుతం నయనతార, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కదా అని మరికొందరు అడిగితే చెప్పుకొచ్చారు.

గతంలో శింబు, నయనతార ప్రేమించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయారు. తాజాగా 'వాలు' సక్సెస్‌ మీట్‌లో శింబు వద్ద ఈ విషయం కొందరు ప్రస్తావించగా ''నయనతారతో ప్రేమ విఫలమైన విషయం గురించి మళ్లీ అడుగుతున్నారు. నిజానికి మేం గొడవపడి విడిపోలేదు. అప్పటి పరిస్థితుల దృష్ట్యా విడిపోయాం. తాజాగా 'ఇదు నమ్మ ఆళు'లో కూడా కలసి నటిస్తున్నాము''అని చెప్పారు.

Simbhu talked about Nayantara marriage

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నిక్‌ ఆర్ట్స్‌ చక్రవర్తి నిర్మాతగా శింబు, హన్సిక జంటగా విజయ్‌ చందర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘వాలు' చిత్రం తాజాగా విడుదలై తమిళనాట మంచి కలెక్షన్స్ రాబట్టుతోంది. శింబు హీరోగా తమిళంలో రూపొందిన ‘వాలు' అనే సినిమా, మూడేళ్ళుగా విడుదలకు నోచుకోకుండా ఈ తమిళ స్టార్ హీరోను ఎంతగానో ఇబ్బంది పెట్టింది. ఈ మూడేళ్ళలో వేరే ఏ ఇతర సినిమా చేయక, ‘వాలు' విడుదల కాక శింబు కెరీర్ అస్థవ్యస్థంగా తయారైంది.

‘వాలు' సినిమా కొన్ని ఆర్థిక సమస్యల వల్ల విడుదలకు నోచుకోకుండా కోర్టు వద్ద ఆగిపోయింది. చాన్నాళ్ళ పాటు కోర్టు ముందు ఎన్నో చర్చలు జరిగినా విడుదల దాకా వచ్చి సినిమా చాలాసార్లు ఆగిపోయింది. ఈ నేఫథ్యంలో అసలు ‘వాలు' విడుదలవుతుందా? లేదా? అన్న ప్రశ్న కూడా తలెత్తింది.

అయితే చివరకు తమిళ పరిశ్రమ సపోర్ట్, శింబు కృషితో సినిమా విడుదలకు గత వారం మోక్షం కలిగింది. ఆగష్టు 14న తమిళ నాట పెద్ద ఎత్తున విడుదలైన ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. శింబు స్టైల్ కమర్షియల్ సినిమాకు హిట్ టాక్ కూడా రావడంతో అభిమానులు కూడా సంబరాల్లో మునిగిపోయారు. ఇక ఇన్నేళ్ళుగా తనను ఎంతో ఇబ్బందికి గురిచేసిన ‘వాలు' చివరకు థియేటర్లకు రావడంతో పాటు హిట్ దిశగా దూసుకుపోతుండడంతో శింబు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం శింబు వరుస సినిమాలను లైన్లో పెట్టి మళ్ళీ తన ప్రాభవాన్ని నిలబెట్టుకునే దిశగా అడుగులేస్తున్నారు.

English summary
A lot of reports from leading-English dailies surfaces on the internet about actress Nayanthara being secretly married to director Vignesh Shivan. Simbhu talked about this marriage.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu