»   »  శింబుని అరెస్ట్ చేయటానికి రంగం సిద్దం

శింబుని అరెస్ట్ చేయటానికి రంగం సిద్దం

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: యంగ్ మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్‌ సంగీత దర్శకత్వంలో నటుడు శింబు పాడిన ‘బీప్‌ సాంగ్‌' ప్రస్తుతం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మహిళలను హేళన పరిచేలా సినిమాలను రూపొందిస్తారనే ముద్ర శింబుపై ఉంది. ఈ బూతు పాటతో అది మరింత పెరిగిపోయి...చివరకు అది అరెస్టుకు దారి తీసే స్దాయికి చేరింది. ఈ మేరకు పోలీస్ అధికారులు చెన్నై చేరినట్లు సమాచారం.

వివాదం పూర్వా పరాల్లోకి వెళితే.... తమిళ హీరో శింబు, అనిరుధ్ లపై మహిళా హక్కుల సంఘం 'ఆల్ ఇండియా డెమొక్రటిక్ వుమన్స్ అసోసియేషన్' కోయంబత్తూర్ లో ఫిర్యాదు చేసింది. ఆ పాట పేరు బీప్ సాంగ్. అనిరుధ్‌ రవిచందర్ స్వరపరిచిన 'ఎన్న పీ.... లవ్ పన్ రోమ్' పాటలో అసభ్యకర పదాలు ఉండడంతో బీప్ సాంగ్ గా పేర్కొంటున్నారు.

ఈ పదాలు స్పష్టంగా విన్పిస్తుండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. బీప్ పాటను తాను విడుదల చేయలేదని తమిళ హీరో శింబు తెలిపాడు. ఈ పాట బయటకు రావడంపై గీత రచయిత చారు నివేదిత విస్మయం వ్యక్తం చేశాడు.

Simbu to be arrested today for beep song

భారీ వర్షాలతో చెన్నై, తమిళనాడులోని కొన్ని జిల్లాలు అతలాకుతలమైన తరుణంలో బీప్ సాంగ్ ను విడుదల చేయడాన్ని శింబుఖండించాడు. అయితే తాను రాసిన ఈ పాటలో ప్రయోగించిన పదాలపై తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నాడు.

ఈ పాటను తాను విడుదల చేయలేదని శింబు వివరణయిచ్చాడు. అకారణంగా తనను నిందించడం పద్దతి కాదని అన్నాడు. ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్న ఈ పాట అసభ్యకరంగా ఉందని అంతా మండిపడుతున్నారు.

ఈ వివాదంపై మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం అతడు టొరంటోలో ఉన్నాడు.

English summary
Police officials have arrived Chennai to arrest music director Anirudh and actor Simbu for their abusive beep song. Beep song crooned by Tamil Hero Simbu, and composed by Anirudh Ravichander has landed them in trouble.
Please Wait while comments are loading...