»   » శింబు హీరోగా ‘పోటుగాడు’ రీమేక్

శింబు హీరోగా ‘పోటుగాడు’ రీమేక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కన్నడలో సూపర్ హిట్ అయిన 'గోవిందాయనమ:' చిత్రాన్ని తెలుగులో మంచు మనోజ్ హీరోగా 'పోటుగాడు' పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. మనోజ్ కెరీర్లో పోటుగాడు చిత్రం బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం త్వరలో తమిళంలోనూ రీమేక్ కాబోతోంది.

పోటుగాడు చిత్రాన్ని తెలుగులో నిర్మించిన శ్రీధర్ లగడపాటి ఈ చిత్రాన్ని తమిళంలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమిళ రీమేక్‌లో లిటిల్ సూపర్ స్టార్‌గా పేరొందిన శింబు నటించేందుకు ఎంతో ఆసక్తికనబరుస్తున్నాడట. ఈ విషయమై నిర్మాత శ్రీధర్ లగడపాటి మాట్లాడుతూ...'ఈ చిత్రం తెలుగు వెర్షన్ చూసిన శింబు కచ్చితంగా నటిస్తానని మాట ఇచ్చారు' అని తెలిపారు.

తమిళంలో ఈచిత్రానికి తమిళ దర్శకుడు, 'నా ఆటోగ్రాఫ్...' ఫేం చేరన్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో నటుడు సంతానం కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అని శ్రీధర్ లగడపాటి చెప్పుకొచ్చారు.

తెలుగు వెర్షన్ 'పోటుగాడు' చిత్రంలో శింబు తెల్ల పిల్ల...అనే పాట పాడిన విషయం తెలిసిందే. ఈ సాంగు సినిమాకు హైలెట్ కావడంతో విడుదలకు ముందు సినిమాకు మంచి పబ్లిసిటీ తెచ్చింది. సినిమా విడుదలైన తర్వాత సాంగు చిత్రీకరణకు బాగుందనే ప్రశంసలు అందాయి.

English summary
Producer Lagadapati Sreedhar said that Potugadu movie is now going to be made in Tamil. Sreedhar will produce the Tamil version and Tamil Star Simbu is going to be seen as the hero in this movie. Director Cheran is expected to handle this remake.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu