»   » ఫ్లాప్ ఇచ్చినా పెద్ద హీరోతో చిత్రం

ఫ్లాప్ ఇచ్చినా పెద్ద హీరోతో చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : తమిళ విలక్షణ దర్శకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న సెల్వరాఘవన్... ఆర్య- అనుష్క జంటగా వర్ణ( 'ఇరండాం ఉళగం' )రూపొందించారు. ఈ చిత్రం ప్రేక్షకుల తిరస్కరణకు గురికావటంతోపాటు పలు విమర్శలను కూడా ఎదుర్కొంది. సెల్వరాఘవన్‌ కొంతకాలంపాటు విరామం తీసుకోనున్నట్లు కూడా వార్తలొచ్చాయి.

వీటికి తెర దించుతూ.. శింబు హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారాయన. ఇటీవల శింబుతో సమావేశమై ఓ కథను వినిపించారట. శింబుకు నచ్చటంతో ప్రాజెక్టు పట్టాలపైకి ఎక్కించేందుకు నిశ్చయించారట. ప్రస్తుతం దీనికి తుదిరూపునిచ్చే పనిలో ఉన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని దర్శకుడి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

Simbu Teams Up With Selvaraghavan

వర్ణ' ఒక రొమాంటిక్ ఫాంటసీ ఫిల్మ్. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం సెల్వరాఘవన్. రెండు విభిన్నమైన లోకాల నేపథ్యంలో ఈ చిత్రం నడుస్తుంది. ఈచిత్రంలో ఆర్య, అనుష్క ద్విపాత్రాభినయం చేసారు. ఈ చిత్రంలో క్యారెక్టర్ కోసం ఆర్య సిక్స్ ప్యాక్ బాడీ పెంచడం విశేషం. చిత్రంలోని పోరాట సన్నివేశాల కోసం ఆర్య, అనుష్క కత్తి యుద్ధంలో శిక్షణ పొందారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అందమైన లొకేషన్లతో పాటు, జార్జియా దేశంలోని అడవుల్లో, గోవా, రియో డె జానెరియో, బ్రిజిల్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. ఈచిత్రానికి హరీష్ జైరాజ్ సంగీతం అందించగా, అనిరుద్ రవిచంద్రన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేసారు. రామ్ జీ సినిమాటోగ్రఫీ అందించారు. ఫరూఖ్, సత్యం శివకుమార్, సోనుసూద్, ఢిల్లీ గణేష్, అను హాసన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. అవతార్ చిత్రానికి పని చేసిన హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈచిత్రానికి స్పెషల్ ఎఫెక్ట్స్ అందించారు.

English summary
Silambarasan seems to be on a roll. After bagging Gautham Menon's movie, now yet another ace filmmaker has signed him. Well, it is none other than Selvaraghavan, whose recent movie Irandam Ulagam bombed at the Tamil Box Office. Sources say that Simbu is all set to team up with Selvaraghavan for the first time
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu