»   »  అజిత్ ని అనుకరిస్తున్న హీరో

అజిత్ ని అనుకరిస్తున్న హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu
Simbu
తమిళంలో మాస్ హీరోగా గుర్తింపుతెచ్చుకున్న శింబు అజిత్ వీర ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే.ఆ అభిమానంతో అతనిప్పుడు అజిత్ హీరోగా చేసిన భిల్లా సినిమాలోని డాన్ గెటప్ ని వేసుకోబోతున్నాడు.అది తాజాగా శింబు చేస్తున్న Silambattam అనే చిత్రం క్లైమాక్స్ లో ఈ సన్నివేశం చోటు చేసుకోనుంది.ఇంతకు ముందు కూడా మన్మధ సినిమా పోలీసులనుంచి తప్పించుకునే సన్నివేశంలో అతను అజిత్ సినిమా ఆడుతున్న ధియోటర్ వద్దకు వెళ్ళి అతని అభిమానులలో కలిసిపోయి తప్పించుకుంటాడు.అంతేగాక అజిత్ కటౌట్ ముందు వెళ్ళి స్టైల్ గా నిలబడతాడు.

ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు శరవన్ కి ఈ ఆలోచన వచ్చిందిట.వెంటనే శింబు భిల్లా కాస్టూమ్ డిజైనర్ కి ఫోన్ చేసి ఆ గెటప్ డ్రెస్ కుట్టించుకున్నాడుట.అంతే గాక ఆ బ్యాక్ గ్రౌండ్ ని కూడా ఆ సన్నివేశాల్లో ఉపయోగిస్తున్నాడుట. ఎంత తాను హీరోనైనా సాధారణ అభిమానిలా అజిత్ ని అనుకరించటం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X