»   »  తప్పులే సిమ్రాన్ కు పాఠాలు...

తప్పులే సిమ్రాన్ కు పాఠాలు...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Simran
ఇప్పుడు గొప్పవాళ్ళ లిస్టులోకి సిమ్రాన్ చేరబోతోంది. ఎందుకంటే తప్పులు చేయటం మానవ సహజం...దాని నుండి పాఠాలు నేర్చుకున్నవారే గొప్పవాళ్ళవుతారు. సిమ్రాన్ ను అప్పట్లో చంద్రముఖి లో ప్రభు భార్య జ్యోతిక పాత్ర కోసం మొదట అడిగారు. కాని అప్పటికి మంచి ఫామ్ లో ఉన్నామె రజనీ పాత్ర హీరోయిన్ గా నయనతార పాత్రే హైలెట్ అవుతుందని భావించి సెకెండ్ హీరోయిన్ ఛాన్స్ వద్దనుకుంది. కానీ చిత్రంగా జ్యోతికే అందరి దృష్టిలో పడి పాపులర్ అయిపోయింది. నాలుక కరుచుకున్న ఆమె తరువాత జాగ్రత్తగా కెరీర్ ని మలుచుకుందామనుకుంది. కాని ఈలోగా వివాహం జరిగింది. తర్వాత ప్రారంభించిన సెకెండ్ ఇన్నింగ్స్ వర్కవుట్ కాలేదు.

మళ్ళీ ఈ మధ్య పి.వాసు కుచేలుడు కోసం పశుపతి భార్య పాత్ర కోసం అడిగాడామెను. ఛ...ఇంత బ్రతుకూ బ్రతికి సెకెండ్ హీరోయిన్ గా అదీ పశుపతి భార్యగానా అనుకుని నో చెప్పేసింది. దాంతో దాన్ని మీనా అందిపుచ్చుకుంది. ఈ లోగా ఆమె కుచేలుడు కు ఒరిజనల్ అయిన కథా పెరియంబోల్ చూడటం తటస్థించిందిట. దాంతో అబ్బా భలే పాత్ర మిస్ చేసుకున్నానే అని ఫీలయిపోయిందిట.

ఈ లోగా పశుపతి ప్రక్కన మరో ఆఫర్ వచ్చిందిట. అదీ మోహన్ బాబు గేమ్ (హిందీలో Taxi No 9211") రీమేక్ లో. తెలుగులో శోభన వేసిన పాత్ర అది. దాంతో అప్పుడు శోభన వేసిన చంద్రముఖి పాత్ర వదులుకున్నట్లుగా ఈ సారి కూడా జరగకూడదనుకుంది. చప్పున ఒప్పేసుకుందిట. అంటే పిల్లాడి తల్లిగా నటించబోతోందన్నమాట. యోదేమైనా పాఠాలు నేర్చుకుని అలా పాత్రకు కమిట్ అవ్వటం గ్రేటే అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X