twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దృశ్యం' రీమేక్ చేయటం లేదని వెల్లడి

    By Srikanya
    |

    చెన్నై : మాలీవుడ్‌లో ఇటీవల వచ్చిన 'దృశ్యం' అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. మోహన్‌లాల్‌ - మీనా జంటగా నటించారు. పలు భారతీయ భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్‌ చేసేందుకు గట్టి పోటీ నెలకొనగా.. తమిళంలో నటించేందుకు కమల్‌హాసన్‌ను,తెలుగులో వెంకటేష్ ను ఎంపిక చేశారు. అయితే ఇందులో కమల్ సరసన సిమ్రాన్ నటించటునున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే తెలుగులోనూ సిమ్రాన్ ని పోలీస్ అధికారి పాత్రకు అడిగినట్లు మీడియాలో గుప్పు మంది. ఈ నేపధ్యంలో సిమ్రాన్ ఈ చిత్రంలో తాను చేయటం లేదని తెలియచేసింది.

    సిమ్రాన్ మాట్లాడుతూ... "నేను 'దృశ్యం' రీమేక్ కి సంభందించి ఏ భాషలోనూ నటించటం లేదు. నా ప్రొఫెషినల్ ప్లాన్స్ ను సమయం వచ్చినప్పుడు తప్పకుండా మీడియాకు తెలియచేస్తాను ,"అన్నారు. ఆమె రీసెంట్ గా అహా కళ్యాణం చిత్రంలో నటించింది.

    అలాగే ఓ మంచి పాత్ర ఉందంటే నటులు దాన్ని చేసి మెప్పించాలని తాపత్రయపడుతూంటారు. తాజాగా విక్రమ్,కమల్ హాసన్ విక్రమ్ ఓ పాత్ర కోసం పోటీ పడ్డారు. అయితే అది కమల్ నే వరించిందని కోలీవుడ్ సమాచారం. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌, సీనియర నటి మీనా ప్రధాన పాత్రధారులుగా ఇటీవల విడుదలైన 'ద్రిష్యుం' అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసింది. అందులో మోహన్ లాల్ పాత్ర కోసం ఈ నటులిద్దరూ పోటీ పడ్డారు.

    ప్రేమ, యాక్షన్‌ సన్నివేశాలకు తావులేని ఈ చిత్రంలో మోహన్‌లాల్‌ ఇద్దరు పిల్లలకు అమాయక తండ్రిగా కనిపించి మెప్పించారు. ఈ పాత్రలో నటించేందుకు తమిళం నుంచి కమల్‌హాసన్‌, చియాన్‌ విక్రమ్‌ ఆసక్తి కనబర్చారని తెలిసింది. దర్శకుడు జీతుజోసఫ్‌ మాత్రం కమల్‌నే ఎంపిక చేసుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. తమిళంలోనూ ఆయనే తెరకెక్కించనున్నారని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నట్లు సమాచారం.

    ఇక రీమేక్ సినిమాలను ఎన్నింటినో చేసి రీమేక్ ల ద్వారా హిట్ లు సాధించిన మన తెలుగు హీరో వెంకటేష్ మరో సారి ఈ రీమేక్ సినిమా ని ఎంచుకున్నారు. "దృశ్యం'' సినిమాను తెలుగులో వెంకటేష్ హీరోగా పునర్ నిర్మించనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేర్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైడ్ యాంగిల్ ఈ మూడు సంస్థలు సినిమాను తెలుగులో సంయుక్తంగా నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు అతి త్వరలో వెల్లడించనున్నారు.

    English summary
    Simran Said... "I'm not doing any role in any language in any remake of Drishyam, I shall reveal my professional plans to the media at the appropriate time,” Simran added.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X