»   » సుచిత్రకు పిచ్చి అంటే నేను నమ్మను, ఏదో జరుగుతోంది : సుచీలీక్స్ పై గీతామాధురి

సుచిత్రకు పిచ్చి అంటే నేను నమ్మను, ఏదో జరుగుతోంది : సుచీలీక్స్ పై గీతామాధురి

Posted By:
Subscribe to Filmibeat Telugu

అయితే ఈ వ్యవహారం లో ఇప్పటివరకూ సుచిత్ర ని తప్పుపట్టిన వాళ్ళే తప్ప ఆమె కు మద్దతు పలికిన వాళ్ళు లేరు అయితే ఇప్పుడు ఆమె తరఫున కూడా మద్దతు మొదలయ్యింది మొట్టమొదటి సారి మరో సింగర్ గీతామాధురి ఈ వివాదం పై సుచిత్రకు అనుకూలంగా తన మాటలను వినిపించింది ఇంతకీ గీతా ఏం చెప్పిందీ అంటే

సుచీలీక్స్

సుచీలీక్స్

కోలీవుడ్‌లో సుచీలీక్స్ ప్రస్తుతం వివాదాస్పదమైంది సుచీ లీక్స్ ... ఇప్పుడు ఈ పదాలు వినిపిస్తే చాలు సౌతిండియన్ సినిమా సెలబ్రిటీలు బెదిరి కళ్లు తేలేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ప్రముఖ గాయని సుచిత్ర ట్విట్టర్ నుంచి లీక్ అవుతున్న ఫోటోలు, వీడియోలు దక్షిణాదిన పెను సంచలనం సృష్టిస్తున్నాయి.

సెలెబ్రిటీలు భయం భయంగా

సెలెబ్రిటీలు భయం భయంగా

ఇండస్ట్రీలోని మరో కోణాన్ని ఈ ఫోటోలు బయటపెట్టేయడంతో సెలెబ్రిటీలు భయం భయంగా కాలం గడుపుతున్నారు. తన అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారంటున్న సింగర్ సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ నుంచి సినీ ప్రముఖుల ప్రైవేట్ ఫోటోలు బయటకు వస్తున్న వైనం తెలిసిందే.ఈ 'సుచి లీక్స్' వ్యవహారం ఏ స్దాయికి వెళ్లిందంటే...

డైరెక్టర్ సెల్వ రాఘవన్

డైరెక్టర్ సెల్వ రాఘవన్

సుచి లీక్స్‌ పేరుతో ఎప్పుడు ఏ విషయం బయటికి వస్తుందా అని ఆసక్తిగా జనం, టెన్షన్ గా సినిమా జనం ఎదురు చూస్తున్నారు. ... కొందరు సెలబ్రిటీల చీకటి రహస్యాలను అలాగే బయటపెట్టిన షాకింగ్ విషయాల్లో నుంచి సింగర్ కమ్ హీరోయిన్ ఆండ్రియాకు పంపిన ఒక ప్రైవేట్ మెయిల్ కూడా ఉంది....

సెలబ్రిటీల జీవితాల్లోని చీకటి కోణాలు

సెలబ్రిటీల జీవితాల్లోని చీకటి కోణాలు

సుచీ లీక్స్ ద్వారా లీకైన ఫోటోలు, వీడియోలు, సెలబ్రిటీల రహస్య జీవితానికి సంబంధించిన విషయాలు.... సినీ ప్రేక్షకుక లోకాన్ని, సాధారణ ప్రజానీకాన్ని షాకయ్యేలా చేశాయి. పలువురు సెలబ్రిటీల జీవితాల్లోని చీకటి కోణాలు చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. సుచి లీక్స్ నేపథ్యంలో సినీ అభిమానులు ట్విట్టర్‌ను కూడా టెలివిజన్‌లా చూస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

ప్రతీ రోజు ఎలాంటి సంచలనాలను లీక్ చేస్తుందో, లేదా ఫోటోలను, వీడియోలను ట్వీట్ చేస్తుందో అని మీడియా ఎదురుచూడటం ఒక వంతుగా మారింది.సుచి లీక్స్ పై ఒకసారి ఆమె ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందన్న మాట ఓవైపు.. మరోవైపు.. ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని సుచి భర్త కమ్ నటుడు కార్తీక్ కుమార్ చెబుతున్నారు.

చిత్రకు పిచ్చిపట్టిందని

చిత్రకు పిచ్చిపట్టిందని

మరోవైపు సుచిత్రకు పిచ్చిపట్టిందని కొందరు, సైకోలా మారిందని మరికొందరు, ఆమెఎకౌంట్ హ్యాక్ అయిందని ఇంకొందరు చాలా రకాలుగా చెప్పుకొచ్చారు. కానీ ఇన్నిరోజుల్లో ఆమెకు మద్దతిచ్చేవాళ్లు మాత్రం ఎవరూ కనిపించలేదు. ఎట్టకేలకు సుచిత్రకు మద్దతుగా గీతామాధురి మాట్లాడింది.

గీతామాధురి

గీతామాధురి

సుచిత్రకు పిచ్చిపట్టిందంటే తాను నమ్మనని అంటోంది గీతామాధురి. డిప్రెషన్ కు లోనయ్యేంత బలహీన మనస్తత్వం సుచిత్రది కాదని అంటున్న గీతామాధురి... విచారణలో నిజానిజాలు బయటపడతాయని అంటోంది. సుచిత్ర కేవలం సింగర్ మాత్రమే కాదని... రేడియోజాకీ, రచయితగా ఆమె చాలా టాలెంటెడ్ అని చెబుతున్న గీతామాధురి.. సుచిత్ర కచ్చితంగా మళ్లీ వెలుగులోకి వస్తుందని నమ్మకంగా చెబుతోంది.

English summary
South Indian Playback singer Geetha madhuri Reacted on Suchi leakes, she is the Only person Who Supported Singer Suchitra who is started suchi leaks Controversy
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu