»   » హీరో సూర్య ..దోశ ఛాలెంజ్ వెనక అసలు కారణం ఇదే,దేవిశ్రీప్రసాద్ కూడా వేస్తాడేమో

హీరో సూర్య ..దోశ ఛాలెంజ్ వెనక అసలు కారణం ఇదే,దేవిశ్రీప్రసాద్ కూడా వేస్తాడేమో

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: కేవలం తమిళనాడునే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్‌ సంపాదించుకున్న హీరో సూర్య. ఆయన తాజాగా దోశలు వేయటం మొదలెట్టారు. అదేంటి సినిమాలు చేసుకోక మధ్యలో ఈ దోశలు మొదలెట్టడం ఏమిటీ అంటారా..ఏం చేస్తారు భార్య కోసం తప్పలేదు.


తాజాగా సూర్య తన ట్విట్టర్‌ ఖాతాలో రెండు ఫొటోలను పోస్ట్‌ చేశారు. ఒక ఫొటోలో స్టౌ ముందు నిల్చుని దోశపోస్తుండగా, మరో ఫోటోలో దోశ పట్టుకుని సతీమణి జ్యోతికతో ఫొటోకు పోజిచ్చారు. ప్రేమతో దోశ వేశానని.. నటుడు మాధవన్‌, దర్శకుడు వెంకట్‌ప్రభు, సంగీత దర్శకులు హరీష్‌ జైరాజ్‌, దేవిశ్రీ ప్రసాద్‌లను ఛాలెంజ్‌ చేస్తున్నట్లు సూర్య ట్వీట్‌ చేశారు.

దీనికి మాధవన్‌, వెంకట్‌ ప్రభు, దేవిశ్రీ ఛాలెంజ్‌కు ఒప్పుకున్నట్లు ట్విటర్‌లో బదులిచ్చారు.

సినిమా ప్రమోషన్ కోసం రకరకలా ఆలోచనలు చేస్తూంటారు సినీ జనం. అయితే తమ సినిమాలు ప్రమోట్ చేసుకోవటమే కష్టంరా అనుకుంటే...తమ భార్య నటిస్తున్న సినిమాలు కూడా ప్రమోట్ చేసుకోవాలి అంటే డబుల్ పనే..కానీ తప్పదు కదా అందుకే హీరో సూర్య ఇలా దోశలు మొదలెట్టాడు అన్నమాట.

చాలా కాలం క్రితమే సినిమాలు ఫుల్ స్టాఫ్ చెప్పేసిన జ్యోతిక ఆ మధ్యన మళ్లీ రీఎంట్రీ ఇచ్చి.. '36 వయదినిలే' అనే సినిమా చేసింది. ఆ సినిమా జస్ట్ ఓకే అనిపించుకుంది కానీ పెద్దగా కిక్ ఇవ్వలేదు. భాక్సాఫీస్ వద్ద పెద్ద ఇంపాక్ట్ కలచెయ్యలేదు.

అయినా ఆమె ఆగకుండా రెట్టించిన ఉత్సాహంతో ...ఓ సినిమా మొదలెట్టేసింది. ఆ సినిమాకు 'మగలిర్ మట్టుం' (ఆడాళ్లు మాత్రమే) అనే టైటిల్ పెట్టారు. అయితే ఆ టైటిల్ చూసి జనం కంగారు పడ్డారు ఇదేదో ఆడాళ్లు వాళ్ల హక్కుల, పోరాటాలు, సెంటిమెంట్లు మీద నడిచే సినిమా అయ్యింటుందని భావించారు. దాంతో ఆ ముద్ర చెరిపివేయటానికా అన్నట్లుగా...ఓ టీజర్ ని విడుదల చేసారు.

లక్కీగా.. టీజర్ రిలీజైన తర్వాత మాత్రం జనాల అభిప్రాయమే మారిపోయింది. చూసిన ప్రతి ఒక్కరూ ఈ టీజర్ సూపర్బ్ అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు వర్షం కురుస్తోంది. అంత ప్రత్యేకత ఈ టీజర్లో ఏముందో చూద్దాం పదండి.

ఈ తమిళ టీజర్ లో ... ఒక కారు ముందుకు కదులుతుండగా అందులోంచి ఆడగొంతులు వినిపించాయి. ఒకావిడ నీ ట్యాబ్ లో క్యాల్కులేటర్ ఉందా అని అడుగి తీసుకుని, మా ఇంట్లో ఏడుగురు ఉంటారు. ఒక్కొక్కరు ఆరు దోసెలు తింటారనుకుంటే.. నెలలో 20 రోజులు వేసుకున్నా గత 30 ఏళ్లలో నేను 3 లక్షలకు పైగా దోసెలు వేసి ఉంటానని అంటుంది. ఇంకొకావిడ నేను మా ఆయనకు మాత్రమే 5 లక్షలు దోసెలు వేసిచ్చి ఉంటా అంటుంది. ఇంకొకావిడ తన లెక్క రెండున్నర లక్షలని తేలుస్తుంది.

మనం ఇన్నేసి దోసెలు వేసిచ్చాం మనకు ఎవరైనా ఎప్పుడైనా ఒక్క దోసె వేసిచ్చారా అన్న డిస్కషన్ వస్తుంది. ఈ డైలాగ్స్ ఇలా నడుస్తుండగానే కారు అద్భుతమైన హిల్ స్టేషన్ అందాల మధ్య దూసుకెళ్తూ ఉంటుంది. చివర్లో జ్యోతిక కారు దిగి.. నేనూ ఈ లోకంలోనే ఉన్నా అని అరుస్తుంది. ఆమెతో ఉన్న ముగ్గురూ కూడా వచ్చి జాయిన్ అవుతారు. ఇదీ 'మగరిల్ మట్టుం' టీజర్ . 'కుట్రం కడితాల్' సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న బ్రమ్మన్ ఈ చిత్రానికి దర్శకుడు. జ్యోతిక భర్త సూర్యనే నిర్మాత.

మరి ఈ టీజర్ ని ప్రమోట్ చెయ్యాలంటే సూర్యనే రంగంలోకి దిగాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే ఇదిగో ఇలా పై విధంగా దోశ పళ్లెం పట్టుకుని రంగంలోకి దిగాడు. మరి ఈ దోశ క్యాంపైన్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.

English summary
Hero Surya started a Dosa challenge for his wife Jyothika’s new movie “Magalir Mattum” a female centric one. The challenge is that one have to make Dosa for their mother, wife, sister and have to post pictures on their twitter walls. Surya has did the same and challenged Devi Sri, Madhavan, and Harish jayaraj. Lets see how this challenge goes on with others.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu