Just In
Don't Miss!
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
1 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న ‘రెమో’ సిరిక్కాదే వీడియో
చెన్నై: తమిళ నటుడు శివ కార్తికేయన్, కార్తీ సురేష్ జంటగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం 'రెమో'. అక్టోబర్ 7న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. 24ఎఎం స్టూడియోస్ బేనర్లో ఆర్.డి రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈసినిమాకు పబ్లిసిటీ పెంచడంలో భాగంగా ఓ ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 'సిరిక్కాదే' పేరుతో రూపొందిన ఈ మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా వీడియో 1 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ వీడియో కాన్సెప్టు, టేకింగ్, ఫోటోగ్రఫీ, ఆర్ట్స్ డైరెక్టర్ వర్క్ హాలీవుడ్ స్థాయిలో ఉందనే ప్రశంసలు వినిపిస్తున్నాయి.

సోనీ మ్యూజిక్ ఇండియా వారి యూట్యూబ్ ఛానల్, ట్విట్టర్ పేజీ ద్వారా ఈ వీడియో ప్రమోషనల్ సాంగును రిలీజ్ చేసారు. ఈ ప్రమోషనల్ సాంగు కాన్సెప్టుకు ప్రభురాధాకృష్ణన్ దర్శకత్వం వహించారు. యూత్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందించారు. విగ్నేష్ శివన్ లిరిక్స్ అందించగా, అర్జున్ కనుంగో, శ్రీనిధి వెంకటేష్ వోకల్స్ అందించారు. ఈ సాంగుకు స్వరూప్ ఫిలిప్ డైరెక్టర్ ఆప్ ఫోటోగ్రఫీగా పని చేసారు.
ఈ ప్రమోషనల్ మ్యూజిక్ వీడియోలో శివకార్తికేయన్, కార్తి సురేష్, అనిరుధ్, అర్జున్ కనుంగో, శ్రీనిధి వెంకటేష్, ఇన్నో గెంగా, మరియా, శశాంక్ విజయ్, కేబ జర్మయ్య తదితరులు నటించారు. ఈ మ్యూజిక్ వీడియో ఇంగ్లీష్ వెర్షన్ కూడా రిలీజవుతోంది.

'కమ్ క్లోజర్' పేరుతో ఇంగ్లీష్ వెర్షన్ 'సిరిక్కాదే' వీడియోను సెప్టెంబర్ 5న న జరిగే మూవీ ఆడియో రిలీజ్ సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. ఎంటీవీలో ఈ ఇంగ్లీష్ వెర్షన్ 'కమ్ క్లోజర్' సాంగ్ టెలికాస్ట్ కానుంది. సినిమా చాలా బాగా వచ్చిందని, రెమో' మూవీ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీలైన 24ఎఎం స్టూడియోస్ అధినేత ఆర్.డి రాజా ..... దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ తో మరో సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించారు.