»   » మాజీ హీరోయిన్ సీత మళ్ళీ పెళ్లీ చేసుకుంది

మాజీ హీరోయిన్ సీత మళ్ళీ పెళ్లీ చేసుకుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎనభై, తొంభైలలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సీత ఆ తర్వాత ఆంటీ పాత్రలకు సెటిలైంది. అవికూడా పెద్ద గిట్టుబాటు కాకపోవటంతో టీవీకి తరిలివెళ్ళిపోయి సెటిలైంది. అయితే ఈ గ్యాప్ లో ఆమె తమిళంలో హీరో కమ్ దర్శకుడు అయిన పార్ధీపన్ ని వివాహమాడింది..ముగ్గురు పిల్లలకు తల్లైంది. వాళ్ళు అభినయ, కీర్తన, ఓ కుమారుడు రాధాకృష్ణన్. వీళ్ళు ముగ్గరూ ప్రస్తుతం తండ్రి పార్ధీపన్ తోనే ఉంటున్నారు. అయితే భర్తతో పడక మనస్పర్ధలతో...ఆ మధ్య విడాకులు ఇచ్చి విడిగా బ్రతుకుతోంది. ఇప్పుడు తన తోటి టీవీ నటుడు సతీష్ ని రెండో వివాహం చేసుకుంది. వీళ్ళిద్దరూ ఓ టీవీ సీరియల్ లో కలుసుకున్నారు. ఇక సీత, పార్ధీపన్ లకు జన్మించిన కీర్తన...మణిరత్నం అమృత చిత్రంలో లీడ్ రోల్ చేసి ప్రశంసలు పొందింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu