»   » ధనుష్‌తో విభేదాలు లేవు

ధనుష్‌తో విభేదాలు లేవు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : నటుడు ధనుష్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని తమిళ హీరో శివకార్తికేయన్‌ తెలిపారు. శివకార్తికేయన్‌ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాక.. ఆయనకు పెద్ద చేయి అందించి.. పెద్ద చిత్రాల్లో నటింపజేసిన ఘనత ధనుష్‌దే. 'ఎదిర్‌నీచ్చల్‌' వంటి చిత్రాన్ని నిర్మించి శివకార్తికేయన్‌కు హిట్‌కు ఇచ్చారు. తాను నటించిన '3' సినిమాలో కూడా కీలకమైన పాత్రలో అవకాశం ఇచ్చారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Sivakarthikeyan Denies Rift with Dhanush

అంతేకాకుండా తాజాగా 'కాక్కిసట్టె' చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంటోందని మీడియాలో ప్రచారం సాగుతోంది. దాంతో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఈ విషయమై పెద్ద చర్చ నడుస్తోంది. హీరో ఫ్యాన్స్ మధ్య తిట్లు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో తనకు ఎలాంటి విభేధాలు లేవని వివరణ ఇచ్చారు.

శివకార్తికేయన్‌ మాట్లాడుతూ.. వాస్తవానికి మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మా స్నేహం అలాగే కొనసాగుతోంది. 'కాక్కిసట్టె' సినిమా కార్యక్రమానికి ధనుష్‌ హాజరుకాక పోవడంతో ఇలాంటి వదంతులు వ్యాపిస్తున్నాయి. ఆయన మమ్మల్ని పూర్తిగా నమ్మారు. బడ్జెట్‌ కూడా ప్రారంభంలో నిర్ణయించకుండా.. అంతా మా చేతుల్లోనే పెట్టేశారు. పోలీసు పాత్రలో నటించగలననే ఆత్మవిశ్వాసాన్ని నాలో నింపింది ధనుషే. 'కాక్కిసట్టె' నేను నటిస్తున్న ఏడో చిత్రం. తక్కువ కాలంలో ఇంత స్టార్‌డమ్‌ను అందించిన ప్రేక్షకులకు ఎప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు.

English summary
Dhanush and Sivakarthikeyan have been good friends for the last few years and have treated each other as brothers.Rumours have been doing the rounds that there is a rift between the two actors. However, Sivakarthikeyan has denied the rumours and has confirmed that he is still good friends with the national-award winning actor.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu