' సూపర్‌ స్టార్‌' అని పిలవకండని రిక్వెస్ట్

By Srikanya

చెన్నై : తనను 'ఇలయ సూపర్‌స్టార్‌' అని పిలవద్దంటున్నాడు తమిళ యంగ్ హీరో శివ కార్తికేయన్‌. ఆయన ఎలాంటి వెన్నుదన్ను లేకుండా చిత్రపరిశ్రమలోకి వచ్చి వడివడిగా ఎదుగుతున్నాడు. 'మనంకొత్తిపరవై', 'ఎదిర్‌నీచ్చల్‌'లాంటి వరుస విజయాలతో చక్కటి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'ఎదిర్‌నీచ్చల్‌'ను మరో అగ్రనటుడు నటుడు ధనుష్‌ నిర్మించాడు.

ఇటీవల శివ కార్తికేయన్‌ నటించిన కొత్త చిత్రం 'వరుత్తపడాద వాలిబర్‌ సంఘం' ఆడియో విడుదలలో వక్తలు ఆయన్ను రజనీకాంత్‌తో పోల్చితే, ప్రేక్షకులు 'ఇలయ సూపర్‌స్టార్‌' అని పిలవటం గమనార్హం. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తనలాంటి నటుణ్ని ఇవి ఇబ్బందిపెడతాయని భావించాడో ఏమో.. తనను అలా పిలవకండని వేడుకుంటున్నాడు.

ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ఒక సూర్యుడు, ఒక చంద్రుడులానే సూపర్‌స్టార్‌ కూడా ఒక్కరే. ఆయనే మన రజనీకాంత్‌. అందరిలానే నేనూ ఆయనకు వీరాభిమానిని. తలైవర్‌ నటించిన చిత్రం విడుదల రోజున తొలి షోను చూడకుండా ఉండలేను. ఇప్పడు కూడా మన సూపర్‌స్టార్‌కు అలాంటి వీరాభిమానులే ఉన్నారు. నన్ను ఆయనతో పోల్చకండని కోరుకుంటున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X