»   » శివకార్తియేయన్ ‘రెమో’ ఆడియో ఆల్బం ప్రివ్యూ

శివకార్తియేయన్ ‘రెమో’ ఆడియో ఆల్బం ప్రివ్యూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ నటుడు శివ కార్తికేయన్, కార్తీ సురేష్ జంటగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం 'రెమో'. అక్టోబర్ 7న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. 24ఎఎం స్టూడియోస్ బేనర్లో ఆర్.డి రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించడంతో తమిళ సంగీత అభిమానుల్లో ఆడియోపై మంచి అంచనాలున్నాయి. సెప్టెంబర్ 5న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ వేడక జరుగబోతోంది. ఈ సినిమా ఆల్బంలోని ఆడియో ట్రాక్ లిస్టులు కూడా రిలీజ్ చేసారు.

Sivakarthikeyan’s Remo Album Preview

ట్రాక్ 01 - రెమో నీ కాదలన్ | సింగర్ - అనిరుధ్ | లిరిక్స్ - విఘ్నేష్ శివన్ | డ్యూరేషన్ - 4:03
ట్రాక్ 02 - సెంజితాలెయ్ | సింగర్ - అనిరుధ్ | లిరిక్స్ - విఘ్నేష్ శివన్ | డ్యూరేషన్ - 4:11
ట్రాక్ 03 - సిరిక్కాదే | సింగర్స్ - అర్జున్ కనుంగో & శ్రీనిధి| లిరిక్స్ - విఘ్నేష్ శివన్ | డ్యూరేషన్ - 4:06
ట్రాక్ 04 - మీసా బ్యూటీ | సింగర్స్- రిచర్డ్-అనిరుధ్ | లిరిక్స్ - వివేక్ | డ్యూరేషన్ - 4:10
ట్రాక్ 05 - దావుయా | సింగర్ - సంతోష్ నారాయణన్ | లిరిక్స్ - కె యూ కార్తీక్ | డ్యూరేషన్ - 4:27
ట్రాక్ 06 - తమిళ్ సెల్వి | సింగర్ - నాకాష్ అజీజ్ | లిరిక్స్ - విఘ్నేష్ శివన్| డ్యూరేషన్ - 3:50
ట్రాక్ 07 - కమ్ క్లోజర్ (సిరిక్కాదే ఇంగ్లిష్ వెర్షన్) | సింగర్ - ఇన్నోజెంగా | లిరిక్స్ - ఇన్నోజెంగా | డ్యూరేషన్ - 3:50

'సిరిక్కాదే' పేరుతో ఇటీవల ప్రమోషన్ సాంగ్ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. తమిళంలో ఆల్రెడీ రిలీజైన ఈ వీడియోకు మంచి స్పందన వచ్చింది. ఇదే ప్రమోషనల్ సాంగ్ ఇంగ్లిష్ వెర్షన్ 'కమ్ క్లోజర్' పేరుతో రిలీజ్ రిలీజ్ చేయబోతున్నారు. ఆడియో వేడుక సందర్భంగా 'కమ్ క్లోజర్' రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

'రెమో' మూవీ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీలైన 24ఎఎం స్టూడియోస్ అధినేత ఆర్.డి రాజా ..... దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ తో మరో సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించారు.

English summary
Kollywood fans express grand welcome to Anirudh’s songs of the movie Remo. Remo Nee Kadhalan, Senjitaley, and Sirikathe had already stolen the hearts of Anirudh fans. The audio launch for Remo has been revealed to be on 5th September 2016. The entire team of Remo foresees a striking response for the compositions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu