»   » శివకార్తికేయన్ ‘రెమో’ మూవీ ఆడియో రిలీజైంది

శివకార్తికేయన్ ‘రెమో’ మూవీ ఆడియో రిలీజైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ నటుడు శివ కార్తికేయన్, కార్తీ సురేష్ జంటగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం 'రెమో'. అక్టోబర్ 7న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. 24ఎఎం స్టూడియోస్ బేనర్లో ఆర్.డి రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Sivakarthikeyan’s Remo Audio out

వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 5న ఆడియో రిలీజ్ చేసారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియో ఆల్బంలో మొత్తం 7 పాటలున్నాయి. ఆడియోకు మంచి స్పందన వస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Sivakarthikeyan’s Remo Audio out

'సిరిక్కాదే' పేరుతో ఇటీవల ప్రమోషన్ సాంగ్ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. తమిళంలో ఆల్రెడీ రిలీజైన ఈ వీడియోకు మంచి స్పందన వచ్చింది. ఆడియో రిలీజ్ సందర్భంగా 'సిరిక్కాదే' సాంగ్ ఇంగ్లిష్ వెర్షన్ ను 'కమ్ క్లోజర్' పేరుతో రిలీజ్ రిలీజ్ చేసారు.

'రెమో' మూవీ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీలైన 24ఎఎం స్టూడియోస్ అధినేత ఆర్.డి రాజా ..... దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ తో మరో సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించారు.

English summary
The audio of "Remo," which is scored by Anirudh Ravichander is getting positive reviews. The album has seven songs.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu