రజనీ కొత్త చిత్రం టైటిల్ ప్రకటన : వివాదం మొదలైంది
చెన్నై : దక్షిణ భారత సూపర్‌స్టార్ రజినీకాంత్ 159వ చిత్రం ఖరారైంది. ఈ చిత్రం టైటిల్ 'కబలి' అని దర్శకులు రంజిత్ ప్రకటించారు. ఇటీవల పలు చిత్రాల్లో తన అభినయంతో మెప్పించిన బాలీవుడ్ తార రాధికా ఆప్టే హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ చిత్రంలో రజిని పాత్ర పేరు కబాలీశ్వరన్ అని దర్శకులు తెలిపారు. తమిళనాడులోని మైలాపూర్‌లో ఈ చిత్ర కథ ప్రారంభమై అనంతరం సింగపూర్‌కు వెళ్తుందని చెప్పారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నారు.

అయితే అప్పుడే ఈ టైటిల్ వివాదం మొదలైంది. మైసూర్ కి చెందిన శివకుమార్ అనే దర్సక,నిర్మాత ఈ టైటిల్ తనదేనని మీడియా ముఖంగా చెప్పారు. చాలా కాలం నుంచి ఈ టైటిల్ తన వద్దే ఉందని, తాను ఈ టైటిల్ తో ఆల్రెడీ సినిమా చేస్తున్నాని అన్నారు. అయేతే తాను ఫైనాన్సియల్ ప్లాబ్లంలతో సినిమాని రిలీజ్ చేయటం లేటు అయ్యిందని అన్నారు. నేను చాలా సార్లు ఈ టైటిల్ రెన్యువల్ కోసం ప్రయత్నించాను కానీ కుదరలేదని అన్నారు. ఇప్పుడేం చేయాలో తనకు అర్దం కావటం లేదని అన్నారు.
రజనీకాంత్ కొత్త చిత్రానికి 'కబాలి' అనే పేరును ఖరారు చేశారు. రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే నెల రెండో వారంలో మలేసియాలో మొదలుకానుంది. అక్కడ సుమారు 50 రోజులపాటు చిత్రీకరణ ఉంటుంది. సినిమాలో రజనీకాంత్ చెన్నైలోని మైలాపూర్ ప్రాంతానికి చెందిన యువకుడిగా కనిపిస్తాడు. అతను కపాలీశ్వరుని భక్తుడు. అందుకే సినిమాకు ఆ పేరును ఖరారు చేసినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











