»   » స్నేహా ఉల్లాల్ కి 'సింహా 'కలిసిరాకపోయినా 'వేదం' లిప్ట్ ఇస్తోంది

స్నేహా ఉల్లాల్ కి 'సింహా 'కలిసిరాకపోయినా 'వేదం' లిప్ట్ ఇస్తోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణ సరసన సింహా చిత్రంలో చేసినా కొత్తగా ఆఫర్స్ ఏమీ రాలేదు. అయితే ఇప్పుడు వేదం పేరు చెప్పి స్నేహా ఉల్లాల్ కి ఓ మంచి ఆఫర్ వచ్చింది. అదేంటి స్నేహా ఉల్లాల్ కీ వేదంకి సంభందం ఏమిటీ అనుకుంటున్నారా. వేదం తమిళ రీమేక్ లో స్నేహా ఉల్లాల్ ని తీసుకోవటానికి నిర్ణయమయింది. ఏ పాత్రకీ అంటే తెలుగులో దీక్షా సేధ్ చేసిన డబ్బున్న అమ్మాయి పాత్రకి. అల్లు అర్జున్ చేసిన కేబుల్ రాజు పాత్రను శింబు చేస్తున్నారు. అలాగే మనోజ్ పాత్రను భరత్ చేత చేయించాలని అడిగారు కానీ మనోజ్ ఎపిసోడ్ యాజటీజ్ గా ఉంచాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక అనుష్క చేసిన అమలాపురం సరోజ పాత్రను కొద్దిగా మార్చి అదే ఎపిసోడ్స్ కి డబ్బింగ్ చెప్పాలని నిర్ణయించారు. యవన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నీరవ్ షా కెమెరా అందిస్తున్నారు. తెలుగులో డైరక్ట్ చేసిన క్రిష్..తమిళ వెర్షన్ కి సైతం డైరక్ట్ చేయనున్నారు. ఇక స్నేహా ఉల్లాల్..శింబు సరసన ఆఫర్ రావటం చాలా గొప్ప విషయంగా మంచి ఎంట్రీగా భావించి ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇక తమిళంలో ఈ చిత్రం టైటిల్ వానమ్. ఆర్.బి.చౌదరి ఈ చిత్రం రైట్స్ తీసుకున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu