twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెక్స్ కు వాడుకోవాలన్న నటి వ్యాఖ్య...పెరుగుతున్న దుమారం

    By Srikanya
    |

    చెన్నై : 'పురుషుల్ని టిష్యూ పేపర్‌లా వాడుకోవాలి... సెక్స్ అవసరం తీరిన తరువాత చేతులు దులుపుకోవాలి.. వారితో వివాహం పేరుతో శాశ్వత బంధాన్ని పెంచుకోకూడదు' అంటూ ప్రముఖ సినీనటి సోనా వివాదాస్పద వ్యాఖ్యల వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. సోనాపై తమిళనాడు పురుషుల భద్రతా సంఘం మండిపడిన సంగతి తెలిసిందే. సోనా వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే పరిణామాలు తీవ్రంగా వుంటాయని హెచ్చరించింది. ఈనెల 19వ తేదీన అంతర్జాతీయ పురుషుల దినోత్సవం నేపథ్యంలో సోనా ఇంటిని ముట్టడిస్తామని ప్రకటించింది. దానికి కౌంటర్ గా సోనా బుధవారం నగర పోలీసు కమిషనర్ జార్జిని కలుసుకుని కంప్లైంట్ ఇచ్చింది.

    దీంతో చెన్నయ్‌లోని సోనా ఇంటికి ముందస్తు జాగ్రత్తగా పోలీసులు భద్రత కల్పించారు. స్థానిక తేనాంపేట కేపీ దాసన్ వీధిలో వున్న సోనా ఇంటికి, ఆమె కార్యాలయానికి, ఆమెకు చెందిన నగల దుకాణానికి సోమవారం ఉదయం నుంచి పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. ఏ సమయంలోనైనా ఆందోళనకారులు సోనా ఇంటిపైకి దాడి చేసే అవకాశాలు వున్నట్టు తేనాంపేట పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇదిలా వుండగా, బీసెంట్‌నగర్‌లోనూ వున్న సోనా ఇంటికి కూడా పోలీసు భద్రతను కల్పించారు.

    ఇప్పటికే సోనాపై మండిపడుతున్న పురుషుల భద్రతా సంఘం సభ్యులకు హిందూ మక్కల్ పార్టీకి మద్దతు తెలిపింది. వెంటనే ఆమెను అరెస్టు చేయాలన్న డిమాండ్‌లను తెరపైకి తెచ్చారు. హిందూ మక్కల్ పార్టీ కార్యదర్శి పీఆర్ కుమార్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేస్తూ సోనాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. యావత్ పురుష ప్రపంచాన్ని కించపరిచే విధంగా సోనా వ్యాఖ్యలు వున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతీయతకు, భారతీయ సంస్కృతికి వైవాహిక బంధం పెట్టింది పేరని, అలాంటి పవిత్రమైన బంధాన్నికించపరుస్తూ వ్యాఖ్యలు చేయడమే కాకుండా పురుషులను 'టిష్యూ పేపర్'గా సోనా అభివర్ణించడం ఆమె నైతికతను ప్రతిబింబిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    మహిళా సంఘాలు కూడా సోనా వ్యాఖ్యలను ఖండించాలని పిలుపునిచ్చారు. ఓ వార పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన సోనా తన పెళ్లి ప్రస్తావనపై స్పందిస్తూ 'లైంగిక జీవితంలో పురుషులను టిష్యూ పేపర్‌లాగా వినియోగించుకోవాలం'టూ వ్యాఖ్యానించడంతో పెద్ద దుమారమే రేగుతోంది. ఇదిలా వుండగా, వివాదం ముదురుతోందని గ్రహించిన సోనా నింపాదిగా తేరుకుంది. తాను అలా అనలేదని, తాను ఎవరికీ, ఏ పత్రికకూ ఇంటర్వ్యూ ఇవ్వలేదని, తాను అనని మాటలను అన్నట్టుగా చిత్రీకరిస్తూ తనను వివాదంలోకి లాగుతున్నారంటూ సోనా వాపోయింది.

    'పురుషులంటే నాకు ప్రత్యేకమైన గౌరవం వుంది. నా స్నేహితుల్లో 99 శాతం మంది పురుషులే'నంటూ కొత్త పాటను అందుకుంది. ఎవరో కావాలనే తనను వివాదంలో ఇరికించేందుకే ఇలాంటి వదంతులు పుట్టిస్తున్నారని వెల్లడించింది. కాగా ఆమె నగర పోలీసు కమిషనర్ జార్జిని కలుసుకొని తనపై వదంతులను పుట్టించే వారిపై చర్యలు చేపట్టాలని ఫిర్యాదు చేసింది.

    English summary
    Sexy actress Sona approached the Chennai city commissioner S George to take action against Rumars. An interview of Sona published in a Tamil magazine recently quoted her as saying that she would use men for sex "as tissue paper." She also reportedly ridiculed the institution of marriage and the concept of the Indian family, the association said in a complaint to police commissioner S George. Sona has denied the allegations, saying the magazine had printed things which she never said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X