Just In
Don't Miss!
- News
ప్రజాస్వామ్య విజయం, అమెరికన్లందరికీ అధ్యక్షుడిని: జో బైడెన్ ప్రసంగం, ట్రంప్‌కి చురక
- Finance
డిసెంబర్ నెలలో గూగుల్ పేను వెనక్కి నెట్టిన ఫోన్ పే
- Sports
IPL 2021: తెలుగు ప్లేయర్లను వదులుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్!
- Automobiles
భారత్‌లో కొత్త వోల్వో ఎస్60 సెడాన్ విడుదల : ధర & ఇతర వివరాలు
- Lifestyle
Shukra Neeti Rules : ఇలా చేస్తే మీ వయసు మంచులా కరిగిపోతుందని మీకు తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దుమ్మురేపిన సూర్య.. సుధా కొంగర.. రికార్డు వ్యూస్‌తో హంగామా
తమిళ చిత్ర పరిశ్రమను కూడా కరోనావైరస్ వదిలిపెట్టలేదు. 2020 సంవత్సరం కోలీవుడ్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. అయితే పలు చిత్రాలు ప్రేక్షకులకు మధురానుభూతిని మిగిల్చాయి. థియేటర్లు మూతపడటంతో ప్రేక్షకులు ఓటీటీని ఆశ్రయించారు. అయితే 2020లో టాప్‌గా నిలిచిన చిత్రాలు ఇవే...
2020లో భారీగా ప్రేక్షకదారణను మూటగట్టుకొన్న చిత్రాల్లో సూరారై పొట్ట్రూ మొదటి స్థానంలో నిలిచింది. ఈ చిత్రానికి సినీ విమర్శకులు భారీ రేటింగ్‌ను ఇచ్చారు. తెలుగులో ఈ చిత్రం ఆకాశం నీ హద్దురా అనే టైటిల్‌తో రిలీజ్ అయింది.

ఆ తర్వాత దర్శకులు సుధా కొంగర, గౌతమ్ వాసుదేవన్ మీనన్, విఘ్నేష్ శివన్, వెట్రిమారన్ దర్శకత్వం వహించిన పావ కధైగల్ వెబ్ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. ప్రకాశ్ రాజ్, సాయిపల్లవి, శంతను భాగ్యరాజ్, అంజలి, కల్కి కోచ్లీన్ తదితరులు నటించారు.
2020 ఆరంభంలో విడుదలైన కన్నమ్ కన్నమ్ కొల్లైయాదితాల్ చిత్రం మంచి విజయాన్ని అందుకొన్నది. ఈ చిత్రం కనులు కనులు దోచాయంటే టైటిల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. దుల్కర్ సల్మాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రితూ వర్మ నటించారు.

ఇక ఏడాది చివర్లో విడుదలైన ముక్తి అమ్మన్ చిత్రం ఓటీటీలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకొన్నది. తెలుగులో అమ్మోరు తల్లి టైటిల్‌తో రిలీజ్ అయింది. ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు కూడా మంచి అనుభూతిని పొందారనే విషయం స్పష్టమైంది.