Soorarai Pottru : సూర్య సినిమా మరో సెన్సేషనల్ రికార్డు.. ఇండియాలో టాప్, ప్రపంచంలో మూడో సినిమా!
గజిని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సూర్య బాగా దగ్గరయ్యాడు. ఆ సినిమా తర్వాత సూర్య నటిస్తున్న దాదాపు అన్ని సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నాయి. ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించిన సూర్య ఇటీవల విడుదలైన ఆకాశం నీ హద్దురా(తమిళంలో సూరారై పోట్రు) సినిమాతో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించారు సూర్య. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపినాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఆస్కార్ ఎంట్రీ కూడా దక్కించుకున్న ఈ సినిమా తాజాగా మరో అరుదైన ఘనత అందుకుంది.

ఆస్కార్ కి నామినేట్
కావడానికి తమిళ హీరోనే అయినా అక్కడతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒకరు. ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలతో ప్రయోగాలు చేస్తూ ఉండే ఆయన గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమవుతున్న సమయంలో ఆకాశం నీ హద్దురా సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆస్కార్ రేస్‌లో కూడా ఈ సినిమా నిలబడినా చివరి దాకా ఉండలేకపోయింది. ఆస్కార్ రేసులో బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్‌లతో పాటు మరికొన్ని కేటగిరీల్లో కూడా ఈ సినిమాను నామినేట్ చేశారు.

ఓటీటీలో సూపర్ హిట్
సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా లాక్ డౌన్ సమయంలో ఓటీటీ వేదికగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో సూర్య నటన, సుధా కొంగర మేకింగ్ అందరినీ అలరించింది. ఈ సినిమాలో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించింది. ఒక సాధారణ పైలట్, ఒక విమానయాన సంస్థ ను ఎలా నెలకొల్పారు అనే అంశం మీద సినిమాను తెరకెక్కించారు.
షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి
మరో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి సైతం ఈ సినిమా ఎంపికయింది. షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో పనారోమా సెక్షన్ 2021 కి గాను ఎంపికయింది. ప్రైజ్ ది బ్రేవ్ పేరుతో ఈ సినిమాను షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కోసం ఎంపిక చేశారు. ఆకాశం నీ హద్దు రా అని తెలుగులో రిలీజ్ అయిన ఈ సినిమాను తమిళంలో సూరరై పొట్రు పేరుతో రిలీజ్ చేశారు. ఎయిర్ డెక్కన్ విమానాల వ్యవస్థాపకుడు కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవితం నుంచి ప్రేరణ పొంది ఈ సినిమాను రూపొందించారు.
ఇండియాలో ఫస్ట్, వరల్డ్ లో థర్డ్
తాజాగా ఈ సినిమా మరో అరుదైన రికార్డు సాధించింది. సినిమా వాళ్ళు కీలకంగా భావించే ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ) లో ఈ సినిమాకి ఏకంగా 9.1 రేటింగ్ దక్కింది. అంతే కాక భారీగా రేటింగ్స్ దక్కించుకున్న సినిమాగా నిలిచింది. ఈ సినిమాకి ఏకంగా 59,654 రేటింగ్స్ దక్కించుకుంది. ఇక ఈ సినిమా ఇండియాలోనే ఈ రేంజ్ లో భారీ ఎత్తున రేటింగ్స్ దక్కించుకున్న మొదటి సినిమాగా నిలిచింది. అలాగే ఈ వరల్డ్ లో మూడో సినిమాగా నిలిచింది.
Recommended Video

40వ సినిమాలో బిజీ
సూర్య ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో తన 40వ సినిమా చేస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా సామాజిక అంశాలతో రూపొందే మాస్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెబుతున్నారు. సూర్య కు తెలుగులో ఉన్న మార్కెట్ దృష్ట్యా ఈ సినిమాని కూడా ఇక్కడ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











