»   »  కంగ్రాట్స్: సూపర్ స్టార్ మళ్లీ తాతయ్యారు

కంగ్రాట్స్: సూపర్ స్టార్ మళ్లీ తాతయ్యారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తాత అయ్యారు. ఆయన చిన్న కుమార్తె సౌందర్య బుధవారం రాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే తాత హోదాలో ఉన్న ఆయన ఈసారి బుజ్జి మనవడు పుట్టడంతో సంతోషంతో ఉన్నారు. తల్లి, బిడ్డా క్షేమమే. దాంతో రజనీ సన్నిహితులందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలియచేటంలో బిజీ అయ్యిపోయారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

2010లో ప్రముఖ వ్యాపారవేత్త అశ్విన్ రామ్ కుమార్ తో సౌందర్య వివాహం జరిగింది. వీరిద్దరికి ఇదే తొలి సంతానం. కాగా రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య...ప్రముఖ తమిళ హీరో ధనుష్ ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం విదితమే. వారిద్దరికీ ఇద్దరు కుమారులు.

గతంలో రజనీ కాంత్ నటించిన 3డి యానిమేషన్ చిత్రం కోచ్చడయాన్(విక్రమ సింహా) చిత్రం ద్వారా సౌందర్య దర్శకురాలిగా పరిచయం అయ్యారు. ఆ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో రజనీకాంత్ 'నా కూతుళ్లు కష్టపడి సంపాదించాల్సిన అవసరం లేదు. నేను సంపాదించింది వృథా చేయకుండా ఉంటే చాలు వారు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను'అని అన్నారు. అదే వేదికపై తన నాన్న మాటను పాటిస్తానని సౌందర్య తెలిపింది. పెళ్లి అయిన నాలుగేళ్లకు పైగా సంతానానికి దూరంగా ఉన్న సౌందర్య.. తండ్రి మాటను తూచా తప్పకుండా పాటించి బుజ్జిబాబుకు జన్మనిచ్చింది.

Soundarya Rajanikanth blessed with male child

ఇక రజనీకాంత్ చిత్రాల విషయానికి వస్తే...

'లింగ' తరవాత కొంత విరామం తీసుకొన్నారు రజనీకాంత్‌. తదుపరి చిత్రంగా 'రోబో 2' చేస్తారని వార్తలొచ్చాయి. అయితే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ రజనీ ఓ యువ దర్శకుడి కథకి అంగీకారం తెలిపారు. 'అట్టకత్తి', 'మద్రాస్‌' చిత్రాలతో తమిళ ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్న దర్శకుడు రంజిత్‌. ఇప్పుడు ఆయనతోనే రజనీ సినిమా ఓకే అయ్యింది. ఈ చిత్రానికి కలైపులి థాను నిర్మాత.

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారు. 'పెదరాయుడు' తర్వాత రజనీకాంత్‌ చేస్తున్న తెలుగు సినిమా ఇదే కావడం విశేషం.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ''ఇది వరకు మా సంస్థ నుంచి వచ్చిన 'యార్‌' చిత్రంలో రజనీ నటించారు. మళ్లీ ఇప్పుడు ఆయనతో ఓ చిత్రం రూపొందించడం ఆనందంగా ఉంది. త్వరలో చిత్రీకరణ మొదలెడతా''ముఅన్నారు.

English summary
Soundarya Rajinikanth gave birth to a male baby at Apollo Hospital on yesterday night.
Please Wait while comments are loading...