»   » అఫీషియల్: రజనీకాంత్ కూతురుకు విడాకులొచ్చేశాయ్!

అఫీషియల్: రజనీకాంత్ కూతురుకు విడాకులొచ్చేశాయ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య తన భర్త, చెన్నైకి చెందిన వ్యాపారవేత్త అశ్విన్‌తో కొంతకాలంగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గతేడాది సెప్టెంబర్లోనే ఇద్దరూ విడిపోయినట్లు ప్రకటించారు. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టు నుండి వారికి మంగళవారం అఫీషియల్‌గా విడాకులు మంజూరయ్యాయి.

సౌందర్య-అశ్విన్ వివాహం 2010లో జరిగింది. దాదాపు ఐదేళ్ల పాటు అన్యోన్య దాంపత్యం సాగించారు. 2015లో వారికి ఒక బిడ్డ పుట్టాడు. కొడుకు తొలిపుట్టినరోజు సందర్భంగా ఏర్పడిన చిన్న వివాదం చిలికి చిలికి పెద్దగొడవకు దారి తీసి ఇద్దరూ విడిపోయే పరిస్థితులకు దారితీసింది.

 Soundarya Rajinikanth And Ashwin Are Officially Divorced

రజనీ కుటుంబ సభ్యులు ఇద్దరినీ కలిపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కొంతకాలంగా పుట్టింట్లోనే ఉంటున్న సౌందర్య... ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీనే తన కెరీర్ గా ఎంచుకుని ముందుకు సాగుతోంది.

సౌందర్య రజినీకాంత్ 'కొచ్చాడియన్' సినిమాతో డైరెక్టర్ పరిచయం అయ్యారు. ప్రస్తుతం ధనుష్ హీరోగా వీఐపీ2 సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కాజోల్ ముఖ్య పాత్రలో నటిస్తోంది. త్వరలో ఈచిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

English summary
A Chennai-based family court finalised the divorce proceedings of superstar Rajinikanth's daughter Soundarya and her estranged husband R Ashwin.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu