TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
చెన్నైలో రజనీకాంత్ కూతురు పెళ్లి సందడి, డాన్స్ చేసిన సూపర్ స్టార్(ఫోటోస్, వీడియో)
సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య పెళ్లి సందడితో చెన్నైలో అభిమానుల కోలాహలం మొదలైంది. సౌందర్య వివాహం నటుడు, బిజినెస్ మేన్ విశాగన్‌తో నేడు(ఫిబ్రవరి 11) జరుగబోతోంది. ఈ వేడుకకు ఎంఆర్‌సి నగర్‌లోని లీలా ప్యాలెస్ వేదిక కాబోతోంది. ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల మధ్య వివాహ వేడుక జరుగనుంది.
రజనీకాంత్ కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ రంగాల నుంచి ప్రముఖులు విచ్చేయనున్నారు. రజనీకాంత్ స్వయంగా వెళ్లి తన కూతురు వివాహానికి ఆహ్వనించారు. మరో వైపు అభిమానులు సైతం తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి చెన్నై తరలి వస్తున్నారు.
వైభవంగా వివాహ వేడుక
వివాహ వేడుక కోసం భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర రాజకీయ ప్రముఖులు, అభిమానులు వస్తున్న నేపథ్యంలో గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ప్రతిపక్ష నేత ఎంకె స్టాలిన్ ఈ హాజరవుతారని టాక్.
సినీ ప్రముఖులు
సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఈ వేడుకలో భాగం కాబోతున్నారు. రజనీకాంత్ తన బెస్ట్ ఫ్రెండ్ కమల్ హాసన్ తో పాటు నిర్మాతలు, డైరెక్టర్లు, నటీనటులను ఆహ్వానించారు. ప్రముఖుల కోసం వివాహ వేడుకలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‌తో మొదలు
ఫిబ్రవరి 8వ తేదీన ప్రీ వెడ్డింగ్ రిసెప్సన్‌తో సౌందర్య-విశాగన్ పెళ్లి వేడుక మొదలైంది. అనంతరం మెహందీ, సంగీత్ వేడుకలు నిర్వహించారు. ఇ:దుకు సంబంధించిన ఫోటోలు సౌందర్య ట్విట్టర్ పేజీ ద్వారా సేర్ చేశారు.
|
సంగీత్‌లో రజనీకాంత్ డాన్స్
పెళ్లి వేడుకలో భాగంగా నిర్వహించిన సంగీత్ వేడుకలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఒరువన్ ఒరువన్ ముదలాలి పాటకు డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పెళ్లి వేడుకలో అనిరుధ్ రవిచందర్
సౌందర్య పెళ్లి వేడుకలో ఆమె స్నేహితుడు, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. నటుడు, రజనీకాంత్ పెద్ద అల్లుడు ధనుష్ పెళ్లి వేడుకకు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
సౌందర్య-విశాగన్
సౌందర్య మొదటి వివాహం పారిశ్రామిక వేత్త అశ్విన్ రామ్ కుమార్‌తో 2010లో జరిగింది. 2016లో ఇద్దరూ విడిపోయారు. వీరికి వేద్ అనే కుమారుడు కూడా ఉన్నారు. విశాగన్‌తో సౌందర్య కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు.