»   » వామ్మో..! మళ్ళీనా??? : రజినీ కూతురు ఆ సినిమాను మళ్లీ తీస్తుందట

వామ్మో..! మళ్ళీనా??? : రజినీ కూతురు ఆ సినిమాను మళ్లీ తీస్తుందట

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎంత గొప్ప హీరో అయినా అన్నీ సక్సెస్ లే ఉండవు కదా అలాగే రజినీకాంత్ కెరీర్ లోనూ బాబా, లింగా లాంటి అట్టర్ ఫ్లాప్ లు ఉన్నాయి అయితే వాటన్నింట్లోకి నెంబర్ వన్ ఫ్లాప్ అంటే మాత్రం అంటే కోచ్చడయాన్ అనే చెప్పాలి. తెలుగులోనూ విక్రమసింహ పేరుతో వచ్చిన ఈ సినిమా గురించి ఏదో ఊహించుకుని వెళ్తే ఇంకేదో చూపించింది రజినీ కూతురు సౌందర్య.

120 కోట్ల బడ్జెట్టు

120 కోట్ల బడ్జెట్టు

అప్పటి దాకా ఒక రేంజి లో అంచనాలతో వచ్చిన సినిమా రిలీజ్ రోజు మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. బొమ్మల సినిమా అంటూ కోచ్చడయాన్ ను తిప్పికొట్టేశారు ప్రేక్షకులు. అసలు యానిమేషన్ రజినీకాంత్ ఏమిటీ? ఇంతోటిదానికి రూ.120 కోట్ల బడ్జెట్టు.. రెండేళ్ల పాటు రజినీ సమయం వృథా అంటూ విమర్శలు గుప్పించారు. కేవలం కూతురి ముచ్చట తీర్చడానికి రజినీ ఇంత రిస్క్ చేశాడేంటని ఆశ్చర్యపోయారు. నిజానికి తిట్టుకున్నారు.

Aishwarya Dhanush Speech @ VIP 2 Press Meet | Filmibeat Telugu
వీఐపీ 2

వీఐపీ 2

ఐతే కోచ్చడయాన్ ఫెయిల్యూర్ గురించి రజినీ కానీ.. సౌందర్య కానీ ఎప్పుడూ పెద్దగా మాట్లాడింది లేదు. ఐతే ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని.. తన బావ ధనుష్ కథానాయకుడిగా వీఐపీ-2 సినిమా తీసిన సౌందర్య.. ఎట్టకేలకు కోచ్చడయాన్ గురించి స్పందించింది.

తప్పు జరిగిందని ఒప్పుకుంది

తప్పు జరిగిందని ఒప్పుకుంది

ఆ సినిమా విషయంలో తప్పు జరిగిందని ఒప్పుకుంది. ఆ సినిమాకు ఉపయోగించిన టెక్నాలజీ అప్పటికి పూర్తిగా కొత్త. ఆ సినిమాలో యానిమేషన్ గురించి ప్రేక్షకులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. అయినా అభిమానులందరూ నాన్నను రియల్ గా చూడాలనుకుంటారు.

వారికి నచ్చలేదు

వారికి నచ్చలేదు

నేను యానిమేషన్ ద్వారా చూపించడం వారికి నచ్చలేదు. అందుకే ఆ సినిమా పరాజయం పాలైంది అంటూ వాస్తవాన్ని అంగీకరించింది సౌందర్య. అక్కడి వరకూ చెప్పి ఆగితే బాగానే ఉండేది కానీ ఇంకో బాంబు పేల్చింది. ఐతే ఇప్పుడు బావ ధనుష్‌ను పెట్టి ‘వీఐపీ-2' తీసిన సౌందర్య.. కుదిరితే ‘కోచ్చడయాన్' సినిమాను మళ్లీ తీస్తానంటోంది.

బాహుబలి తరహాలో

బాహుబలి తరహాలో

లైవ్ యాక్షన్లో ‘బాహుబలి' తరహాలో ‘కోచ్చడయాన్'ను భారీ స్థాయిలో తెరకెక్కించాలని ఆశపడుతున్నట్లు ఆమె చెప్పింది. ఐతే ‘కోచ్చడయాన్' పేరెత్తితేనే బెంబేలెత్తిపోతున్న రజినీ అభిమానులు మాత్రం సౌందర్యకు దండం పెట్టేస్తున్నారు. కూతురి మీద ప్రేమతో రజినీ ఒకసారి చేసిన సాహసం చాలని.. ఇక ఆమెతో ఇంకో సినిమా వద్దే వద్దని.. ‘కోచ్చడయాన్' రీమేక్ అయితే అసలూ ఆ మాటే వద్దని చెప్పేస్తున్నారు.

English summary
Super Star Rajini's Doughter soundarya rajinikanth want to Remake the film Kochadaiyaan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu