»   »  వ్రతం చెడినా దక్కిన ఫలితం

వ్రతం చెడినా దక్కిన ఫలితం

Posted By:
Subscribe to Filmibeat Telugu
Vishal
సెల్యూట్ ఫ్లాఫ్ అయినా విశాల్ ఇప్పుడు బాధ పడటం లేదు. అతని ఫెరఫార్మన్స్ ఆ సినిమాలో చూసిన సెల్వరాఘవన్ తన తదుపరి చిత్రం Thoranai లో హీరోగా తీసుకున్నాడు.ఆ సినిమా జనవరి నుండీ ప్రారంభం కానుంది.నిజానికి సెల్వ్ రాఘవన్ ఆ ప్రాజెక్టును తన తమ్నుడు ధనుష్ తో ప్లాన్ చేసాడు. అయితే ఆ స్క్రిప్టుకి అతను సరిపోతాడా అన్న సందేహం పీకుతోంది. ఈ లోగా విశాల్ సినిమా చూడటం అతని సిక్స్ పాక్ బాడీ నచ్చటం...ఆఫర్ ని ఆఫర్ చేయటం వరసగా జరిగిపోయాయి.

ప్రస్తుతం రాఘవన్ రవితేజ హీరోగా చేసిన విక్రమార్కుడు తమిళ రీమేక్ 'Aayirathil Oruvan' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాలో గజనీ సూర్య తమ్ముడు కార్తీక్,రీమా సేన్ జంటగా చేస్తున్నారు. ఇక ఈ జనవరిలో లాంఛనంగా విశాల్ సినిమాకి ముహూర్తం జరిపి మార్చి నుంచి సినిమా ప్రారంభించే యోచనలో ఉన్నారుట. ఇక ఈ విషయం బయిటకు రాగానే విశాల్ ని లక్కీఫెలో అని అందరూ అభినందిస్తున్నారు. కోలీవుడ్ వాసులు సెల్యూట్ సినిమా ఫెయిలయినా మంచి ఆఫర్ నే తెచ్చిపెట్టింది...వ్రతం చెడినా ఫలితం దక్కిందని నిట్టూరుస్తున్నారు.ఎందుకంటే రాఘవన్ సినిమాకి మినిమం గ్యారెంటీ ఉండటమేనని అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X