»   » శివాజి, కమల్‌ను చూసి రజనీ భయపడ్డారు

శివాజి, కమల్‌ను చూసి రజనీ భయపడ్డారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : బాలనటుడు మహేంద్రన్‌ హీరోగా వస్తున్న రెండో చిత్రం 'విరైవిల్‌ ఇసై'. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలోని కమలా సినిమాస్‌లో జరిగింది. కార్యక్రమానికి సీనియర్‌ దర్శకుడు ఎస్పీ ముత్తురామన్‌, దర్శకులు పేరరసు, పాండియరాజన్‌, నటుడు భరత్‌, అరుణ్‌విజయ్‌, శక్తి, అభిరామి రామనాథన్‌ తదితరులు హాజరయ్యారు. ఎస్పీ ముత్తురామన్‌ ఆడియోను విడుదల చేసి అతిథులకు తొలి సీడీని అందించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''రజనీకాంత్‌తో దాదాపు 25 చిత్రాలకు పని చేశా. కమల్‌తో పది సినిమాలు తీశా. తొలినాళ్లలో శివాజీ, కమల్‌ను చూసి రజనీకాంత్‌ ఆశ్చర్యపోయేవారు. 'శివాజీ.. పుట్టుకతోనే నటుడు, కమల్‌ వైవిధ్యంగా నటిస్తారు.. మరి నేనేమో...' అంటూ ప్రశ్నలు వేసుకునేవారు.

SP Muthuraman talks about Rajini

ఆయనలో ఉన్న స్త్టెల్‌, వేగమే ఈ స్థాయికి చేర్చింది. అదే వేగం మాస్టర్‌ మహేంద్రన్‌లోనూ అప్పుడప్పుడు కనిపిస్తోంది. ఆ వేగాన్ని సరిగ్గా ఉపయోగిస్తే చిత్ర పరిశ్రమలో రాణించడం సులువ''ని తెలిపారు.

నటుడు భరత్‌ మాట్లాడుతూ.. మహేంద్రన్‌ పేరుతో ఉన్న ప్రతి ఒక్కరూ మంచి స్థానాల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇక్కడా మహేంద్రన్‌ పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.

English summary
SP Muthturaman talked about Rajanikanth at Audio function.
Please Wait while comments are loading...