twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణకు ఎస్పీ బాలసుబ్రమణ్యం డబ్బింగ్

    By Srikanya
    |

    శ్రీరామరాజ్యం'తమిళ వెర్షన్ ఈ నెల 13న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ చిత్రం తమిళ వెర్షన్ కు గానూ బాలకృష్ణకు ఎస్పీ బాల సుబ్రమణ్యం,నయనతారకు చిన్మయ డబ్బింగ్ చెప్తున్నారు. చెన్నైలో ఈ డబ్బింగ్ వర్క్ జరుగుతోంది. పురాణ ఇతిహాసాలతో తెరకెక్కిన చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుందని నిర్మాతలు భావించి ఈ చిత్రాన్ని అక్కడ రిలీజ్ చేస్తున్నామంటున్నారు.


    గతంలో రామారావు గారు నటించిన లవకుశ కళాఖండాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ దృశ్య కావ్యాన్ని తెరకెక్కించారు. శ్రీరాముని జననం నుంచి రావణాసుర సంహారం వరకూ పదినిషాల పాటలో ఆ కథంతా ఉంటుంది. ఇప్పటికీ భారతావని అంతా రామరాజ్యం రావాలి అంటూ అనుకుంటూ ఉంటుంది. ఆ రామరాజ్యం ఎలా ఉండేది. రాముని విశిష్టత ఏమిటి.. అన్న విశేషమే శ్రీరామ రాజ్యం అని నిర్మాతలు చెప్తున్నారు.

    ఈ చిత్రానికి ఇళయరాజా రసవత్తరమైన సంగీతం, బాపు దర్శకత్వ ప్రతిభ శ్రీరామరాజ్యంను ఒక అద్భుత కళా ఖండంగా తీర్చిదిద్దారని ప్రశంసలు వచ్చాయి. ఇక ఇప్పటికే అక్కడ ఛానెల్స్ లో వేయటానికి ప్రోమోలు రెడీ అయ్యాయి. అక్కడ కూడా తెలుగు మాదిరిగానే వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీరాముడిగా బాలకృష్ణ, సీతగా నయనతార, వాల్మీకి మహర్షిగా అక్కినేని నాగేశ్వరరావు, భూదేవిగా రోజా, సుమిత్రగా కె ఆర్ విజయ, లక్ష్మణుడిగా శ్రీకాంత్ నటించారు.

    శ్రీ సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ చిత్రానికి ముళ్లపూడి వెంకటరమణ రచన చేసారు. ఇళయరాజా సంగీతం సమకూర్చారు. శ్రీరాముడు రాజుగా పాలించిన ఘట్టమే ఈ చిత్రానికి ప్రధాన కథాంశం. ఈ చిత్రానికి పాటలు: జొన్నవిత్తుల, వెన్నెలకంటి, సినిమాటోగ్రఫీ:పి.ఆర్.కె. రాజు, కూర్పు: జి.జి. కృష్ణారావు, కళ: రవీంద్ర, గ్రాఫిక్స్: కమల్ కణ్ణన్, డాన్స్: శ్రీను, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: తాండవ కృష్ణ, స్క్రీన్‌ప్లే, మాటలు: ముళ్లపూడి వెంకటరమణ.

    English summary
    Sri Ramarajyam to be dubbed and released in Tamil. SP Balasubramanyam will dub for Balakrishna and Chinmayi for Nayanthara.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X