»   » 'రోబో' చూసిన ఆ ముఖ్యమంత్రికి కాస్సేపు నోట మాట లేదు

'రోబో' చూసిన ఆ ముఖ్యమంత్రికి కాస్సేపు నోట మాట లేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ నాడు ముఖ్యమంత్రి కరుణానిధి నిన్న(శనివారం) రజనీకాంత్ తాజా చిత్రం "రోబో" చూసారు. ఆయన శంకర్,రజనీలతో ఈ చిత్రం చూసి కాస్సేపు ట్రాన్స్ లో ఉన్నట్లు మాటలు మాట్లాడలేకపోయారు. ఆ తర్వాత మీడియా ఎదురుగానే రజనీకాంత్ ని కౌగిలించుకుని..ఇప్పటివరకూ వచ్చిన రజనీకాంత్ చిత్రాలన్నిటిలోకి ఇదే బెస్ట్ అని అన్నారు. అలాగే రజనీకాంత్, శంకర్ కలసి ఫిల్మ్ మేకింగ్ ని కంప్లీట్ గా ఓ కొత్త స్ధాయికి తీసుకెళ్ళిపోయారని ప్రశంశించారు. అంతేగాక వీరి కాంబినేషన్ లో వచ్చిన శివాజీ కన్నా చాలా రెట్లు ఈ చిత్రం బాగుందన్నారు. ఇక ఈ స్పెషల్ షోకు దర్శకుడు కె.ఎస్.రవికుమార్, ధనుష్, ఐశ్వర్యా ధనుష్, యవన్ శంకర్ రాజా, కార్తీక్ రాజా, పి.వాసు హాజరయ్యారు. బాల్కనీలో రజనీ,కరుణానిధి, శంకర్ కూర్చున్నారు. మిగతావారంతా క్రింద సీట్లలో కూర్చున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu