»   » ‘స్పైడర్’ ఫీవర్లో మహేష్ బాబు..... నిద్రలేదు, హార్ట్‌బీట్‌ పెరిగింది!

‘స్పైడర్’ ఫీవర్లో మహేష్ బాబు..... నిద్రలేదు, హార్ట్‌బీట్‌ పెరిగింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 'స్పైడర్' మూవీ సినిమా ప్రమోషన్ల జోరు పెంచారు. ఇటు తెలుగునాడు, అటు తమిళనాడు రెండు రాష్ట్రాలు కవర్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. తొలిసారిగా ఆయన తమిళంలో సినిమా చేసిన నేపథ్యంలో అక్కడి మార్కెట్ మీద, ప్రేక్షకుల మీద ఫోకస్ పెట్టారు.

'సైడర్' మూవీ ప్రమోషన్లో భాగంగా మహేష్ బాబు చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి చెన్నైలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హీరోయిన్ రకుల్, దర్శకుడు మురుగదాస్‌, ఎస్‌జే సూర్య, భరత్‌, నిర్మాతలు ఎన్‌వీ ప్రసాద్‌, లైకా ప్రొడక్షన్స్‌ సీఈఓ రాజుమహాలింగం, సినిమాటోగ్రాఫర్‌ సంతోష్‌ శివన్‌ తదితరులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.


నిద్రరావడం లేదు, హార్ట్ బీట్ పెరిగింది

నిద్రరావడం లేదు, హార్ట్ బీట్ పెరిగింది

గతంలో ఏ సినిమాకు పడనంత టెన్షన్ ఈ సినిమాకు మహేష్ బాబు పడుతున్నారు. సినిమా విడుదల దగ్గర కావడంతో వారం రోజుల నుండి సరిగా నిద్రపట్టడం లేదని, హార్ట్ బీట్ కూడా పెరిగిందిన మహేష్ బాబు వెల్లడించారు.


Mahesh Babu to become Kollywood Superstar After Spyder సౌత్ సూపర్‌స్టార్
నా కెరీర్లో ప్రతిష్టాత్మక సినిమా

నా కెరీర్లో ప్రతిష్టాత్మక సినిమా

మురుగదాస్‌ దర్శకత్వంలో నటించడం నా కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకం. నిర్మాతలు ఎన్‌వీ ప్రసాద్‌, ఠాగూర్‌ మధు సపోర్టు చేయడం వల్లే ఇంత పెద్ద ప్రాజెక్ట్ సాధ్యమైంది. లైకా వంటి భారీ సంస్థ తమిళ వెర్షన్‌ పంపిణీ చేయడం సంతోషంగా ఉందని మహేష్ బాబు అన్నారు.


నాకే చాలా కష్టం అనిపించింది, మరి రకుల్ పరిస్థితి..

నాకే చాలా కష్టం అనిపించింది, మరి రకుల్ పరిస్థితి..

తెలుగు, తమిళం తెలిసిన నాకే షూటింగ్‌ సమయంలో చాలా కష్టం అనిపించింది. ఈ రెండు బాషలు సరిగా తెలియని రకుల్‌ ఎంత కష్టపడిందో అర్థం చేసుకోవచ్చు.... అని హీరోయిన్ గురించి మహేష్ బాబు వ్యాఖ్యానించారు.


నా చిరకాల కోరిక

నా చిరకాల కోరిక

సంతోష్‌ శివన్‌ సినిమాటోగ్రఫి అందించడంతో నా చిరకాల కోరిక నెరవేరింది. తెలుగు డైరెక్టర్లకు, నాకు సింక్‌ అవ్వదని చెప్పి ఎప్పుడూ ఆయన సినిమా చేయలేదు. మురుగదాస్‌తో సినిమా అనగానే ఆయనే వచ్చి చేస్తానన్నారు. ఈ సినిమాలో విజువల్స్‌ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయని మహేష్ బాబు తెలిపారు.


ఎవరినీ పోటీగా భావించడం లేదు

ఎవరినీ పోటీగా భావించడం లేదు

తమిళంలో ఏ హీరోని తాను పోటీగా భావించడం లేదని, బడ్జెట్‌ కోసమే రెండు భాషల్లో తీశామని చెప్పారు. కథ, దర్శకుడు సింక్ అయితే ఇకపై ఇలాంటి ద్విబాషా చిత్రాలు చేస్తానని మహేష్ బాబు తెలిపారు.


సూపర్ స్టార్ హోదా అవసరం లేదు

సూపర్ స్టార్ హోదా అవసరం లేదు

నాకు సూపర్ స్టార్ హోదా అవసరం లేదని, అభిమానుల ప్రేమ ఉంటే చాలు అని, అదే తనకు ఎనలేని సంతృప్తిని ఇస్తుందని తెలిపారు.రాజకీయాలపై ఆసక్తి లేదు

రాజకీయాలపై ఆసక్తి లేదు

రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అని మీడియా అడిగిన ప్రశ్నలకు మహేష్ బాబు స్పందిస్తూ.... తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని తెలిపారు.English summary
'Spyder' tamil version press meet held at Chennai. Mahesh Babu, Rakul Preet Singh, SJ Surya, Bharath, AR Murugadoss, NV Prasad, Raju Mahalingam, Santosh Sivan at the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu