»   » 50 లక్షలు కోసం: 'పులి' నిర్మాతలపై శ్రీదేవి కంప్లైంట్

50 లక్షలు కోసం: 'పులి' నిర్మాతలపై శ్రీదేవి కంప్లైంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : నటి శ్రీదేవి మరో సారి వార్తల్లోకి ఎక్కారు. రీసెంట్ గా విజయ్ 58 వ సినిమాలో చేసి హాట్ టాపిక్ గా మారిన ఆమె మరోసారి ఇదే సినిమా విషయమే వివాదంతో కూడిన వార్తగా మారారు. పులి చిత్ర నిర్మాతపై శ్రీదేవి ఫిర్యాదు తన పారితోషికానికి సంబంధించి రూ.50 లక్షలు చెల్లించలేదని నటి శ్రీదేవి నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

సుమారు ఇరవై ఐదు సంవత్సరారల తరువాత తమిళంలో విజయ్ హీరోగా నటించిన పులి చిత్రంలో రాణిగా ప్రధాన పాత్ర పోషించారు. చిత్రం విడుదలయ్యి నెలలు అవుతున్నా పారితోషికంలో రూ.50 లక్షలు ఇంకా బాకీ ఉన్నట్లు , బాకీ పారితోషికం చిత్ర నిర్మాతలు చెల్లించలేదని శ్రీదేవి ముంబాయి సినీ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు.

Sridevi demands her 50 Lakhs from ‘Puli’ makers

అందులో ఆమె పులి చిత్ర నిర్మాతలకు పలు సార్లు ఫోన్ చేసినా సరైన సమాధానం రాలేదని, తన బాకీ పారితోషికాన్ని చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీదేవి ఫిర్యాదును ముంబాయి నిర్మాతల మండలి తమిళ సినీ నిర్మాతల మండలికి పంపింది.

ఇప్పుడు తమిళ సినీ నిర్మాతల మండలి శ్రీదేవి ఫిర్యాదుపై విచారించనుంది.పీటీ.సెల్వకుమార్, శిబూ తమీన్స్ సంయుక్తంగా నిర్మించారు. శింబుదేవన్ దర్శకుడు. ఇందులో నటించడానికి శ్రీదేవి భారీ మొత్తంలో పారితోషికం డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది.

English summary
As per reports Sridevi has filed a complaint in the Tamil Nadu Film Producers’ Council against Puli makers saying that she has not been paid Rs. 50 lakhs yet in her salary. Sridevi played the role of a evil princess in the fantasy movie and the actress got mixed reviews for her role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu