»   » మళ్లీ వార్తల్లోకి శ్రీదేవి కుమార్తె

మళ్లీ వార్తల్లోకి శ్రీదేవి కుమార్తె

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చెన్నై : శ్రీదేవి కుమార్తె ఎంట్రీ ఎప్పుడో కాని మొన్నటి దాకా తెలుగు ఇండస్ట్రీలో, ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు కోలీవుడ్ లో ఆమెపై వార్తలు వెల్లువలా వస్తున్నాయి. ఆమె తమ సినిమాలో నటిస్తుందంటే...మా సినిమాలో నటిస్తుందంటూ ప్రకటనలు వస్తున్నాయి. తాజాగా కెప్టెన్‌ విజయ్ కాంత్ కుమారుడి సరసన అందాల నటి శ్రీదేవి కుమార్తెను నటింపజేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

  విజయకాంత్‌ నట వారసుడు షణ్ముగపాండియన్‌ వెండితెరకు పరిచయం కానున్న 'శతాబ్దం' చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. సంతోష్‌కుమార్‌ రాజన్‌ తెరకెక్కించనున్న ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్‌ ఎంపికపై ప్రత్యేక కసరత్తు సాగుతోందట. తొలుత తమిళంలోని ముద్దుగుమ్మల పేర్లను పరిశీలించిన యూనిట్‌ ప్రస్తుతం దృష్టిని ఉత్తరాది వైపు మరల్చిందట. ముఖ్యంగా శ్రీదేవి కుమార్తె జాహ్నవిని తీసుకోవాలని నిర్ణయించినట్లు, ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

  Sridevi's Daughter Jhanvi

  ప్రేమ, యాక్షన్‌, హాస్యం కలబోతగా సినిమా ఉంటుందని సమాచారం. షూటింగ్‌ను సంక్రాంతి నుంచి ప్రారంభించాలని దర్శకుడికి కెప్టెన్‌ సూచించారట. తొలుత చెన్నైలో ప్రారంభించి.. తర్వాత పాటలను విదేశాల్లో చిత్రీకరించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. జాహ్నవి కనుక ఈ చిత్రం లో చేస్తే తమ సినిమాకు ఖచ్చితంగా క్రేజ్ వస్తుందని దర్శకుడు భావిస్తున్నాడు. అయితే శ్రీదేవి తన కూతురు ఎంట్రీని భారీగా చేస్తుందని, ముఖ్యంగా బాలీవుడ్ పైనే దృష్టి ఉందని అంటున్నారు.

  శ్రీదేవి కుమార్తె జాహ్నవి ఎంట్రీకి భారీగా ప్రయత్నాలు మొదలయ్యాయి. గ్రాండ్ గా ఆమె ఎంట్రీ జరపాలని శ్రీదేవి ఆలోచన. ఆ మేరకు ఆమె సన్నాహాలు చేస్తోంది. బాలీవుడ్‌లో ఎందరో యువకెరటాలకు అవకాశం కల్పించిన సల్మాన్‌ మరోసారి వార్తల్లోకెక్కాడు. బోనీకపూర్‌, శ్రీదేవి పెద్ద కుమార్తె జాహ్నవిని తెరంగేట్రం చేయించేందుకు తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇటీవల బోనీకపూర్‌, శ్రీదేవిని కలుసుకుని జాహ్నవి గురించి చర్చించాడు. వాళ్ల ఇంటికెళ్లినప్పుడు ప్రజలు పెద్దఎత్తున గుమికూడారు కూడా. ఆ సమయంలో 17 ఏళ్ల జాహ్నవి డార్క్‌ బ్లూ టాప్‌ ధరించి చేతిలో సెల్‌ఫోన్‌తో సల్మాన్‌ను తదేకంగా చూస్తున్నారు. శత్రుఘ్నసిన్హా కూతురు సోనాక్షికి అవకాశమిచ్చిన సల్మాన్‌.. టైగర్‌, అథియా శెట్టి, సూరజ్‌ పంచోలీ, సనాఖాన్‌ను కూడా తెరంగేట్రం చేయిస్తున్నారు. మరి జాహ్నవి తెరపైకి ఎప్పుడో వేచి చూద్దాం.

  కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంతో జాహ్నవి బాలీవుడ్‌కి పరిచయం కాబోతోందని ప్రచారం సాగుతోంది. ఈ మేరకు కరుణ్ జోహార్ తో బోనీ కపూర్ చర్చలు జరిపారని చెప్పుకుంటున్నారు. కరుణ్ జోహార్ వంటి స్టార్ దర్శక,నిర్మాత నిర్ధేశకత్వంలో ఎంట్రీ అంటే ఖచ్చితంగా జాతీయ స్ధాయిలో గుర్తింపు వచ్చి పూర్తి బిజీ అవుతుందని భావిస్తున్నారు. కరుణ్ జోహార్ త్వరలో రూపొందించబోయే ఎమోషనల్ లవ్ స్టోరీ కోసం ఆమెను సంప్రదించినట్లు సమాచారం. మరోవైపు తన తల్లిలాగే తెలుగులో ఆమె కెరీర్‌ మొదలుపెట్టే అవకాశం లేకపోలేదని కూడా అంటున్నారు. తెలుగులో యంగ్ హీరోల సరసన ఆమెను అడుగుతున్నారని సమాచారం. జాహ్నవి నటించిన సినిమా అంటే ఆ క్రేజే వేరు. దాంతో ఆమె ఎంట్రీ తమకు అంటే తమకు దక్కాలని అంతా పోటీలు పడుతున్నారు.

  English summary
  Actor cum Politician Vijaykanth’s son Shanmuga Pandiyan is ready to be a hero in a film to be produced by his dad’s own production house Captain Cine Creations. 
 Vijaykanth has got two sons and his elder son Shanmuga Pandiyan is doing his debut through the movie titled as Sakaptham. The film is to be directed by Santhosh Kumar Rajan.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more