»   » శ్రీమంతుడు : చెన్నై స్పెషల్& బెనిఫిట్ షో డిటేల్స్

శ్రీమంతుడు : చెన్నై స్పెషల్& బెనిఫిట్ షో డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై :ఇప్పటికే హీరో ప్రభాస్ నటించిన బాహుబలి తెలుగు,తమిళం భాషల్లో తెరకెక్కి హిందీలోకి అనువాదమై సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విధంగా మహేశ్‌బాబు బ్రహ్మోత్సవం అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. ఇదటుంచితే అంతకు ముందుగా ఆయన నటించిన తాజా తెలుగు చిత్రం శ్రీమంతుడు ఏకకాలంలో సెల్వందన్ పేరుతో తమిళంలోనూ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దాంతో చెన్నైలో స్పెషల్, బెనిఫిట్ షోలు వేస్తున్నారు. ఆ డిటేల్స్ క్రింద ఇచ్చాం చూడండి.

Srimanthudu Chennai Special & Benefit Show Details

మహేష్ మాట్లాడుతూ...గత చిత్రాల ఫలితాల ప్రభావం తదుపరి సినిమాలపై తప్పకుండా ఉంటుంది. పరాజయాల తర్వాత వస్తోన్న సినిమా హిట్ కావాలని ప్రతి హీరో కోరుకుంటాడు. కానీ శ్రీమంతుడు సినిమా ఫలితం విషయంలో మాత్రం నాకు ఆ భయాలన్ని తొలగిపోయాయి. ఊరిని దత్తత తీసుకోవడం అనే యూనివర్సల్ పాయింట్ విజయంపై నా నమ్మకాన్ని పెంచింది. బలమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలోని భావోద్వేగాలు అందరిని మెప్పిస్తాయనే నమ్మకముంది అన్నారు హీరో మహేష్‌బాబు.


మహేశ్‌బాబు తాజాగా తన చిత్రాల రిలీజ్ లో కొత్త పంథాను అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. నటుడిగా తన స్టామినాను పెంచుకునే ప్రయత్నం పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా విడుదలకు ప్లాన్ చేసుకుంటున్నారు. టాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న మహేశ్‌కు కోలీవుడ్‌లో ఇప్పటివరకూ అనువాద చిత్రాలతో పరిచయం అయ్యారు.అయినా ఆయన చిత్రాలకు ఇక్కడ మంచి ఆదరణే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ నేరు చిత్రాల హీరోగా ప్రాచుర్యం పొందే ప్రయత్నం చేస్తున్నారు.


ఇక మహేష్ గత చిత్రాలు 1 నేనొక్కిడినే, ఆగడు చిత్రాలు డిస్ట్రిబ్యూట్ చేసిన ఈరోస్ వారు ఈ సారి 'శ్రీమంతుడు' చిత్రం రైట్స్ చేజిక్కించుకున్నారు. ఓవర్ నైట్ లో జరిగిన ఈ డీల్ లో నిర్మాతలు మైత్రీ మేకర్స్, మహేష్ బాగానే లబ్ది పొందినట్లు సమాచారం. ఈ డీల్ తో నిర్మాతలు పూర్తిగా ఫ్రొపిట్ జోన్ లోకి వెళ్లినట్టే అని ట్రేడ్ వర్గాల సమాచారం. గతంలో మహేష్ రెండు చిత్రాలు డిస్ట్రిబ్యూట్ చేసి ఘోరంగా నష్టపోయిన ఈరోస్ వారు ఈ చిత్రంలో లాభాల బాట పడతామని భావిస్తున్నారు. ఈ ఊహించని పరిణామం ట్రేడ్ ఎనాలసిస్ట్ లను ఆశ్చర్యపరిచింది.


Srimanthudu Chennai Special & Benefit Show Details

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


'శ్రీమంతుడు' విషయానికి వస్తే..


మహేష్ బాబు, శ్రుతిహాసన్‌ జంటగా మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'శ్రీమంతుడు'. సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎలాంటి కట్స్‌ లేకుండా క్లీన్‌ యూ బై ఏ ధ్రువీకరణ పత్రం పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 7న శ్రీమంతుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.


దర్శకుడు మాట్లాడుతూ ''మహేష్‌బాబు పాత్ర చిత్రణ, ఆయన పలికే సంభాషణలు ఆకట్టుకొంటాయి. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో మహేష్‌ చాలా సింపుల్‌గా కనిపిస్తారు. కానీ స్త్టెలిష్‌గా ఉంటారు. శ్రుతిహాసన్‌, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, సుకన్య... ఇలా ప్రతిపాత్రా కీలకమైనదే. సంభాషణలూ కథకి తగ్గట్టే వినిపిస్తాయి. అవసరాన్ని మించి పంచ్‌ సంభాషణలుండవు'' అన్నారు.


జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం. ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి,


కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.

English summary
Mahesh's Srimanthudu Chennai Special & Benefit Show Details are here.
Please Wait while comments are loading...